రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీఆర్) వివిధ గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొవచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 78


⏩ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: 10


⏩ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: 02


⏩ అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్: 01


⏩ జూనియర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్: 01


⏩ కోచ్: 02


⏩ స్టాఫ్ నర్స్: 02


⏩ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్(పాథాలజీ): 01


⏩ జూనియర్ సూపరింటెండెంట్: 12


⏩ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్: 23


⏩ డ్రైవర్ గ్రేడ్ 2: 01


⏩ జూనియర్ అసిస్టెంట్: 23


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 13.08.2023 నాటికి గ్రూప్ సి పోస్టులకు 18 - 27 సంవత్సరాలు; గ్రూప్ బి పోస్టులకు 18 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: యూఆర్‌ కేటగిరీకి రూ.500; ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, సెకండ్ లెవల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.08.2023.


Notification 


Website


ALSO READ:


బ్యాంక్ నోట్ ప్రెస్‌లో 111 సూపర్‌వైజర్&జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే!
దేవాస్ (ఎంపీ)లోని బ్యాంక్ నోట్ ప్రెస్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, 'స్టేజ్-2' దరఖాస్తు తేదీలు వెల్లడి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని ఏపీ పోలీసు నియామక మండలి జులై 19న వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎస్‌ఐ (సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జులై 21న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3న సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని బోర్డు తెలిపింది. అభ్యర్థులందరూ సంబంధిత సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


కాకినాడ జీజీహెచ్‌లో థియేటర్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు - అర్హతలివే!
కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాంట్రాక్ట్/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన థియేటర్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి 10వ తరగతి, డిప్లొమా, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జులై 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక విధానం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial