కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(లైబ్రరీ సైన్స్/ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్‌) లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు 21 నవంబర్ 2022 నుండి 04 డిసెంబర్ 2022 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 1961 చట్టం ప్రకారం ఐఐటీ కాన్పూర్‌ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ మరియు ఆర్ట్స్‌లోని వివిధ శాఖలలో విద్య మరియు పరిశోధనలలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. ఈ ఇన్‌స్టిట్యూట్‌లోని PK కేల్కర్ లైబ్రరీ రోజువారీ పనిలో లైబ్రరీకి సహాయం చేయడానికి లైబ్రరీ సైన్సెస్ రంగంలో తగిన అప్రెంటిస్ ట్రైనీల అవసరం ఉంది. అప్రెంటిస్ ట్రైనీ అభ్యర్థులకు ఒక సంవత్సరం కాలం పాటు శిక్షణ ఇస్తారు. 


వివరాలు..


గ్రాడ్యుయేట్ అప్రెంటిస్


మొత్తం ఖాళీలు: 12 ఖాళీలు


అర్హత: 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(లైబ్రరీ సైన్స్/ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్‌) లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు.


శిక్షణ కాలం: ఒక సంవత్సరం.


స్టైపెండ్: నెలకు రూ.9000.


పని ప్రదేశం: P.K. కేల్కర్ లైబ్రరీ, IIT కాన్పూర్


ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21.11.2022


* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 04.12.2022


Notification


Website


Also Read:


ప్రకాశం జిల్లాలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్ అర్బన్ క్లినిక్/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదోతరగతి, ఎంబీబీఎస్, డీఫార్మసీ/ బీఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత దరఖాస్తులను నింపి సంబధిత ధృవ పత్రాలను జతపరిచి వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, జీజీహెచ్ కాంపౌండ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాలో అందచేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎయిమ్స్‌లో జూనియర్ ఫిజియోథెరపిస్ట్ పోస్టులు
దిల్లీలోని ఎయిమ్స్‌లో ఔట్‌సోర్స్ ప్రాతిపదికన జూనియర్ ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టుకి ఇంటర్ (సైన్స్), ఫిజియోథెరపీలో డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబరు 3లోగా దరఖాస్తుచేసుకాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


జిప్‌మర్‌లో 136 సీనియర్ రెసిడెంట్ పోస్టులు- దరఖాస్తుచేసుకోండి!
పుదుచ్చేరి, కరైకాల్‌లోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతుంది. సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ), ఎండీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబరు 9వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...