ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్ మేనేజ‌ర్ల భ‌ర్తీకి నిర్వహించనున్న ఆన్‌లైన్‌ రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల కాల్ లెటర్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్ లేదా రూల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదు చేసి కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 20న పరీక్ష నిర్వహించనున్నారు.


మ‌ణిపాల్ (బెంగ‌ళూరు), నిట్టే (గ్రేట‌ర్ నోయిడా) విద్యాసంస్థలతో క‌లిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంట‌ర్న్‌షిప్‌, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం ల‌భిస్తుంది.. 


ఐడీబీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ రాత పరీక్ష కాల్‌ లెటర్ కోసం క్లిక్‌ చేయండి..


ప‌రీక్ష విధానం: మొత్తం 200 మార్కుల‌కు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నాలుగు విభాగాలుంటాయి. లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల నుంచి 60- ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్-40 ప్రశ్నలు-40 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్-60 ప్రశ్నలు- 60 మార్కులు అంశాల‌ నుంచి మొత్తం 200 ప్రశ్నలు వ‌స్తాయి. సమయం రెండు గంటలు ఉంటుంది. ప‌రీక్షలో రుణాత్మక మార్కులుంటాయి.  తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. 


తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌న‌గ‌రం, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.


జీతభ‌త్యాలు: ఎంపికైన అభ్యర్థుల‌కు శిక్షణ కాలం (6 నెల‌లు)లో నెల‌కు రూ.5000 ఇస్తారు. ఇంట‌ర్న్‌షిప్ (2 నెల‌లు) స‌మ‌యంలో నెల‌కు రూ.15 వేలు చెల్లిస్తారు. విజ‌య‌వంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన‌వారికి రూ.6.14 నుంచి రూ.6.50 లక్షల వ‌ర‌కు వార్షిక వేతనం అందుతుంది. 


నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


ఆప్కాబ్‌‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత నౌకాదళంలో 224 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా
భారత నౌకాదళం షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ) జూన్ 2024లో ప్రారంభమయ్యే కోర్సులో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖలు, కేడర్‌, స్పెషలైజేషన్లలో శిక్షణ పొందుతారు. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా నౌకాదళంలో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది. సరైన అర్హతలు గల అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..