Vacancy Details for IDBI Bank Executive & Assistant Manager Online Form 2022 : ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఐడీబీఐ బ్యాంకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పూర్తి వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్‌ పద్దతిలో పని చేయాల్సి ఉంటుంది. 


మొత్తం 1544 ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను ఇవాల్టి నుంచి (జూన్‌ 3) నుంచి స్వీకరించనున్నారు. 


వివరాలు సంక్షిప్తంగా ఐడీబీఐ బ్యాంగ్‌ రిక్రూట్‌మెంట్‌ 2022 వివరాలు:- 


పోస్టు పేరు - ఎగ్జిక్యూటివ్ అండ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్-A


పోస్టుల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.


ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు- 1044 
జనరల్ కేటగిరి- 418
ఓబీసీ- 268
ఈడబ్ల్యూఎస్‌- 104 
ఎస్సీ- 175
ఎస్టీ- 79


అసిస్టెంట్‌ మేజనేజర్‌ గ్రేడ్‌-A-500
జనరల్‌- 200
ఓబీసీ- 101
ఈడబ్ల్యూఎస్‌- 52
ఎస్సీ -121
ఎస్టీ-28


ఐడీబీఐ బ్యాంగ్‌ రిక్రూట్‌మెంట్‌  2022 పోస్టులకు విద్యార్హతలు ఏంటంటే:-


ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల కోసం అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఏదైనా విభాగం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కూడా ఏదైనా విభాగంలో డిగ్రీ చేసి ఉంటే చాలు. 


ఐడీబీఐ బ్యాంగ్‌ రిక్రూట్‌మెంట్‌  2022 పోస్టులకు ఎలా అప్లై చేయాలంటే:-
అర్హత ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్తి అప్లై చేయాల్సి ఉంటుంది. జూన్ 17 లోపు అప్లై చేయాలి. 


ఐడీబీఐ బ్యాంగ్‌ రిక్రూట్‌మెంట్‌  2022 పోస్టులకు అప్లై చేయడానికి కావాల్సినవి:-
అప్లై చేయడానికి ఫొటోగ్రాఫ్‌, సిగ్నేచర్‌ రెండే అవసరం అవుతాయి. అప్లికేషన్‌లో మీ విద్య, వ్యక్తిగత వివరాలు అందివ్వాలి. 


ఐడీబీఐ బ్యాంగ్‌ రిక్రూట్‌మెంట్‌  2022 పోస్టులకు ఎంపిక విధానం:-  
మొదట ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుంది. అందులో ఎంపికైన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. తర్వాగ గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. 


ఐడీబీఐ బ్యాంగ్‌ రిక్రూట్‌మెంట్‌  2022 పోస్టులకు ఎంపిక పరీక్ష ఎప్పుడంటే:-
ఎగ్జిక్యూటివ్ పరీక్ష వచ్చే నెల అంటే జులై 9న ఉంటుంది. 
అసిస్టెంట్‌మేనేజర్‌ పోస్టులకు అప్లై చేసేవారికి జులై 23న పరీక్ష ఉంటుంది. 


ఐడీబీఐ బ్యాంగ్‌ రిక్రూట్‌మెంట్‌  2022 పోస్టులకు అప్లై చేయాలంటే ఫీజు వివరాలు :-
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు మినహా మిగిలిన వారంతా వెయ్యిరూపాయ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీఎస్టీ అభ్యర్థులు మాత్రం 200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. పీహెచ్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. 


ఐడీబీఐ బ్యాంగ్‌ రిక్రూట్‌మెంట్‌  2022 పోస్టులకు అప్లై చేయాలంటే వయో పరిమితి ఏంటీ? :-
ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే కనీస వయసు 20 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా పాతికేళ్లకు మించి ఉన్న వాళ్లు అర్హులు కారు. 
అసిస్టెంట్‌ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులకు అప్లై చేయాలనుకునే వారి కనీస వయసు 21 ఏళ్లు ఉండాలి. గరిష్ఢంగా 28 ఏళ్లకు మించి ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఆయా వర్గాలకు మినహాయింపు ఉంటుంది.