ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 136 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.


వివరాలు..


* స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 136 


పోస్టుల కేటాయింపు: యూఆర్‌-55, ఎస్సీ-22, ఎస్టీ-10, ఓబీసీ-35, ఈడబ్ల్యూఎస్‌-14. 


1) మేనేజర్: 84 పోస్టులు


2) అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 46 పోస్టులు


3) డిప్యూటీ జనరల్ మేనేజర్: 06 పోస్టులు


విభాగాలవారీగా ఖాళీలు: ఆడిట్ (ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్)-06, కార్పొరేట్ స్ట్రాటజీ & ప్లానింగ్ డిపార్ట్‌మెంట్-02, రిస్క్ మేనేజ్‌మెంట్-24, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్-09, ట్రెజరీ-05, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్-05, సెక్యూరిటీ-08, లీగల్-12, ఫైనాన్స్ & అకౌంట్స్ డిపార్ట్‌మెంట్-05, కార్పొరేట్ క్రెడిట్-60. 


అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.


పనిఅనుభవం: పోస్టులవారీగా 4 నుంచి 10 సంవత్సరాల వరకు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 01.05.2023 నాటికి కొన్ని పోస్టులకు 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకు 35-45 సంవత్సరాల మధ్య ఉండాలి. మరికొన్నిపోస్టులకు 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.


జీత భత్యాలు: మేనేజర్ పోస్టులకు రూ.48,170 - రూ.69810; అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.63,840- రూ.78,230; డిప్యూటీ జనరల్ మేనేజర్పోస్టులకు రూ.76,010- రూ.89,890గా ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 15.06.2023.


Notification


Website


                                 


Also Read:


ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1036 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 24 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్‌ నేవీలో సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ఛార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ (ముంబయి), హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ (విశాఖపట్నం), హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి), హెడ్‌క్వార్టర్స్ అండమాన్ అండ్‌ నికోబార్ కమాండ్ (పోర్ట్ బ్లెయిర్) యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..