ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డిసెంబరు 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డు పొందవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 31న ఐబీపీఎస్ ఎస్‌వో పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. డిసెంబరు 31 వరకు కాల్ లెటర్లు అందుబాటులో ఉండనున్నాయి.
అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ibps.in
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Online Preliminary Exam Call Letter for CRP SPL XII' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి.
Step 4: వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే అభ్యర్థుల వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలతో కూడిన అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.
Step 5: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్షరోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లడం మంచిది.
IBPS SO prelims exam information handout
Direct link to download IBPS SO admit card 2022
ప్రిలిమినరీ పరీక్ష విధానం:
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్; చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 580 పోస్టులు, యూకోబ్యాంకులో 100 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 30 పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
1) ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 44 పోస్టులు
2) అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 516 పోస్టులు
3) రాజ్‌భాష అధికారి (స్కేల్-1): 25 పోస్టులు
4) లా ఆఫీసర్ (స్కేల్-1): 10 పోస్టులు
5) హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 15 పోస్టులు
6) మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1): 100 పోస్టులు
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2022.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.11.2022.
➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2022.
➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 24.12.2022, 31.12.2022.
➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2023.
➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి, 2023.
➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 29.01.2023.
➥ తుది పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2023.
➥ ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి, 2023.
➥ ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి, 2023.
➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2023.