ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఆర్‌ఆర్‌బీ క్లర్క్ (ఆఫీస్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన స్కోరుకార్డును విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ మార్కులను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్; పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాల ఆధారంగా స్కోరు కార్డును పొందవచ్చు. సెప్టెంబరు 24 వరకు మార్కుల వివరాలు అందుబాటులో ఉండనున్నాయి.
స్కోరు కార్డు కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆఫీస్ అసిస్టెంట్-4483 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ I -2676 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ II - 867 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ III - 80 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 13, 14, తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 8న విడుదల చేశారు.
ప్రిలిమ్స్ స్కోరు కార్డు డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి..
1) అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - https://www.ibps.in/
2) అక్కడ హోంపేజీలో కనిపించే '' Office Assistant Online Preliminary Exam Score Display'' లింక్ మీద క్లిక్ చేయాలి.
3) క్లిక్ చేయగానే కనిపించే ఫలితాల లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను
నమోదుచేయాలి.
4) కంప్యూటర్ తెర మీద ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన స్కోరుకార్డు కనిపిస్తుంది.
5) అభ్యర్థులు తమ స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తపచుకోవాలి.
వెబ్‌సైట్‌లో 'క్లర్క్' మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లు:
ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్ మెయిన్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు(కాల్ లెటర్లు) విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ నుంచి మెయిన పరీక్ష కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 24న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
మెయిన్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
IBPS RRB క్లర్క్ అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చూసుకోండి..
1) అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - https://www.ibps.in/
2) అక్కడ హోంపేజీలో కనిపించే ''IBPS RRB Online Main Exam Call Letters'' లింక్ మీద క్లిక్ చేయాలి.
3) క్లిక్ చేయగానే కనిపించే ఫలితాల లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను నమోదుచేయాలి.
4) కంప్యూటర్ తెర మీద మెయన్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు కనిపిస్తాయి. .
5) అభ్యర్థులు తమ కాల్‌లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాల్‌లెటర్ డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షరోజు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. వీటిలో రీజనింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్/హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.