IBPS RRB Clerk Admit Card 2022: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ మెయిన్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు(కాల్ లెటర్లు) విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ నుంచి మెయిన పరీక్ష కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 24న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.



Direct Link
IBPS RRB Online Main Exam Call Letters

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆఫీస్‌ అసిస్టెంట్‌-4483 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ I -2676 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ II - 867 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ III - 80 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 13, 14, తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఫలితాలను సెప్టెంబరు 8న విడుదల చేశారు. 

IBPS RRB Clerk 2022 Notification



IBPS RRB క్లర్క్ అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చూసుకోండి.. 


1) అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - https://www.ibps.in/

2) అక్కడ హోంపేజీలో కనిపించే ''IBPS RRB Online Main Exam Call Letters'' లింక్ మీద క్లిక్ చేయాలి.

3) క్లిక్ చేయగానే కనిపించే ఫలితాల లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను నమోదుచేయాలి.

4) కంప్యూటర్ తెర మీద మెయన్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు కనిపిస్తాయి. .

5) అభ్యర్థులు తమ కాల్‌లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాల్‌లెటర్ డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షరోజు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.



పరీక్ష విధానం: 
మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. వీటిలో రీజనింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్/హిందీ  లాంగ్వేజ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.




ముఖ్యమైన తేదీలు...



  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్- 7 జూన్ 2022 నుంచి 27 జూన్ 2022 వరకు


  • అప్లికేషన్ ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు (ఆన్‌లైన్)- 7 జూన్ 2022 నుంచి 27 జూన్ 2022 వరకు


  • ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కోసం కాల్ లెటర్‌ల డౌన్‌లోడ్- 9 జూలై 2022


  • ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్- 18 జూలై 2022


  • ప్రిలిమ్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్- జూలై/ఆగస్టు 2022


  • ప్రిలిమ్స్ ఎగ్జామ్- ఆగస్టు 2022


  • ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు- సెప్టెంబర్ 2022


  • మెయిన్స్/సింగిల్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్- సెప్టెంబర్ 2022


  • మెయిన్/సింగిల్ ఎగ్జామ్- సెప్టెంబర్ 2022


  • మెయిన్/సింగిల్ ఎగ్జామ్ రిజల్ట్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్ 2022


  • ఇంటర్వ్యూ అడ్మిట్ కార్డ్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్/నవంబర్ 2022


  • ఇంటర్వ్యూ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్/నవంబర్ 2022


  • ప్రొవిజనల్ అలాట్‌మెంట్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III & ఆఫీసర్ అసిస్టెంట్ (మల్టీపర్పస్))- జనవరి 2023.




Also Read :


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5008 క్లర్క్ ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా క్లరికల్ కేడర్ కింద 5,008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 225 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 7 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, అర్హత, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read :


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 714 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అర్హతలివే!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(ఎస్‌సీఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, అర్హత, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...