IBPS PO Recruitment 2025 : ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్ పర్సనల్‌ సెలక్షన్ (IBPS) వివిధ బ్యాంకుల్లో ఉన్న ప్రొబెషనరీ ఆఫీసర్స్‌/ మేనేజ్మెంట్‌ ట్రైనీస్‌ కోసం నోటిఫికేషన్ వేసింది. పది బ్యాంకుల్లో 5208 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీని కోసం 20 రోజుల క్రితం క్రితం నోటిఫికేషన జారీ చేసింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు నేటి(జులై21)తో ముగుస్తుంది. ఇంకా అప్లై చేయని అభ్యర్థులు అర్థరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ ibps.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 


జులై 1 నుంచి ఈ ఐదువేలకు పైగా ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి నేటితో దరఖాస్తు గడువు ముగుస్తుంది. అనంతరం ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న వారందరికీ ప్రైమరీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అభ్యర్థుల అడ్మిట్ కార్డులను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పెట్టనున్నారు. దాదాపుగా ఆగస్టు ఆఖరి వారంలో పరీక్ష ఉంటుందని సమాచారం. 


దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు ఆఖరి వారంలో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. సెప్టెంబర్‌లో ఈ ఫలితాలను విడుదల చేస్తారు. అనంతరం మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను  సెప్టెంబర్‌లో కానీ అక్టోబర్‌లో విడుదల చేస్తారు. పరీక్ష మాత్రం అక్టోబర్‌లో ఉంటుంది. ఆ పరీక్ష ఫలితాలను నవంబర్‌లో విడుదల చేస్తారు. తర్వాత నవంబర్‌ లేదా డిసెంబర్‌లో పర్శనాలిటీ టెస్టు ఉంటుంది. ఆఖరిగా ఇంటర్వ్యూను డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తారు. అలాట్మెంట్ లిస్ట్‌ వచ్చే ఏడాది జనవరి, లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తారు.


ఐబీపీఎస్‌ పీవో 2025 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే  పోస్టుల వివరాలు ఇవే 
ఈ నోటిఫికేషన్ ద్వారా 10 బ్యాంకుల్లో 5208 పీవో/ఎంటీలను ఐబీపీఎస్‌  భర్తీ చేయబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా- 1000 ఉద్యోగాలు 


బ్యాంక్ ఆఫ్‌ ఇండియా- 700 ఉద్యోగాలు 


బ్యాంక్ ఆఫ్‌ మహారాష్ట్ర- 1000 ఉద్యోగాలు 


సెంట్రల్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా- 500 ఉద్యోగాలు 


కెనరా బ్యాంక్‌-1000 ఉద్యోగాలు 


ఇండియన్ ఓవర్‌సీస్‌బ్యాంక్- 450 ఉద్యోగాలు


పంజాబ్‌ నేషనల్ బ్యాం్‌-200 ఉద్యోగాలు 


పంజాబ్ అండ్ సింద్‌ బ్యాంక్- 358 ఉద్యోగాలు 


ఎవరు అర్హులు ?
ఐబీపీఎస్‌  పీవో 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా 20 ఏళ్లకుపైబడి, 30 ఏళ్ల లోపు వారై ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ కలిగి ఉండాలి. క్రెడిట్ హిస్టరీ బాగుండాలి. సిబిల్ స్కోర్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తారు.