Nindu Manasulu Serial Today Episode ప్రేరణ తల్లీ, చెల్లిని తీసుకొని తండ్రి కోసం హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కి తీసుకొస్తుంది. ఇందు భర్త కోసం చాలా కంగారు పడుతుంది. పరుగులు పెడుతుంది. ఇద్దరు కూతుళ్లు తల్లిని ఓదార్చి ఐసీయూ దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ బెడ్ మీద రాజశేఖరం ఉండరు. దాంతో ప్రేరణ కంగారు పడుతుంది.
ప్రేరణతో ఇందు నాన్న గారు ఏరే అని అడుగుతుంది. బెడ్ మీదే ఉండాలమ్మా వేరే రూమ్‌కి మార్చేరేమో అని ప్రేరణ డాక్టర్‌ని అడుగుతుంది. అతన్ని డిశ్చార్జీ చేశామని డాక్టర్ చెప్పడంతో ముగ్గురు షాక్ అవుతారు. ఎవరు తీసుకెళ్లారని ప్రేరణ అడిగితే వాళ్ల అబ్బాయి తీసుకెళ్లారని డాక్టర్ అంటారు. అబ్బాయి ఎవరు అబ్బాయి తీసుకెళ్లడం ఏంటి అని ఇందు కంగారు పడుతుంది. డాక్టర్ రిసెప్షన్‌లో అడగమని అంటాడు. ప్రేరణ తల్లితో నిన్న ఇంటికి వచ్చిన పోలీసోడే నాన్నని తీసుకెళ్లాడని అంటుంది. ఇందు ఏడుస్తూ వాడు మీ నాన్నని మోసం చేశాడే అంటే ఐశ్వర్య ఏడుస్తూ నాన్నే మనల్ని మోసం చేశాడని ఎందుకు అనుకోకూడదు అంటుంది. దాంతో ప్రేరణ నాన్న మనల్ని మోసం చేశారా లేక నాన్నని వాళ్లు మోసం చేశారో చెప్పాల్సింది మనం కాదు నాన్న అని ముందు నాన్న ఎక్కడికి వెళ్లిందో అడ్రస్ తెలుసుకోవాలని అంటుంది.
ప్రేరణ తల్లి, చెల్లిని తీసుకొని రిసెప్షనిస్ట్‌తో రాజశేఖర్‌ని తీసుకెళ్లిన వాళ్ల అడ్రస్ అడుగుతుంది. మీరు ఏమవుతారని ఆమె అడిగితే ప్రేరణ కూతురు అని చెప్తుంది. ఏంటి మీరు మాట్లాడేది ఆయన్ను తీసుకెళ్లింది ఆయన కొడుకు.. అడ్రస్ అడుగుతుంది ఆయన కూతురు మీరు అడుగుతున్నదానికి చెప్పేదానికి అసలు పొంతన ఉందా.. మీ నాన్న అడ్రస్ మీకు తెలీదా.. ఏంటి ఇలా అడుగుతున్నారు.. మీకు అడ్రస్ ఇస్తే పేషెంట్ తాలూకువాళ్లు మమల్ని తిడతారని అంటుంది. ప్రేరణ వాళ్లు బాధగా పక్కకి వెళ్లిపోతారు.
ఇందు ఏడుస్తూ ఏంటే ఇది ఏంటి మనకు ఈ పరిస్థితి.. మీ నాన్న అడ్రస్ చెప్పమంటే మనల్ని చిన్న చూపు చూస్తున్నారని ఏడుస్తుంది. ప్రేరణ తల్లితో ముందు నాన్నని ఎవరు ఇక్కడ జాయిన్ చేశారో తెలిస్తే అడ్రస్ దొరుకుతుందని అంటుంది. ప్రేరణ తండ్రిని సిద్ధూ హాస్పిటల్‌లో జాయిన్ చేసుంటాడు. మరోవైపు సిద్ధూ ఐపీఎస్ కలని తన తండ్రి అడ్డుకుంటూ ఉంటాడు. సిద్ధూ తన ఫ్రెండ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ నాన్న ఏంట్రా అడుగడుగునా నిన్ను అడ్డుకుంటున్నాడు. నువ్వు కోచింగ్లో జాయిన్ అవ్వకుండా చేయకుండా రికమండేషన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని అంటాడు. ప్రయత్నిస్తూ ఉంటానురా ఎవరో ఒకరు ఆయన నీడ పడని వారు నాకు సాయం చేయరా.. నా లక్ష్యం ఏంటో ఆ మనిషికి తెలిసే వరకు నా తఢాఖా అతనికి చూపిస్తా అంటాడు. తన చెల్లి సాహితి ఇండియా వస్తుందని తనకి సిద్దూ ఆ ఇంట్లో ఉండట్లేదని తెలిస్తే బాధ పడుతుందని తనని ఎలా మ్యానేజ్ చేయాలో అర్థం కావడం లేదని బాధ పడతాడు.
ఇందు కూతుళ్లతో మనల్ని ఎవరూ సాయం చేసేవాళ్లు లేరు..ఎవరూ అర్థం చేసుకోవడం లేదని ఏడుస్తుంది. ఇంతలో ఓ నర్స్ వాళ్ల దగ్గరకు వస్తారు. మీ బాధ చూశానని పేషెంట్‌ని జాయిన్ చేసిన వ్యక్తి నెంబరు ప్రేరణకు ఇస్తారు. ప్రేరణ ఆ నెంబరుకి కాల్ చేస్తే సిద్ధూ లిఫ్ట్ చేయడు. ప్రేరణ ట్రై చేస్తూనే ఉంటుంది. మరోవైపు గణకి పరంధామ్ అనే కానిస్టేబుల్ కాల్ చేసి ప్రేరణ ఫ్యామిలీ మొత్తం వైజాగ్ వదిలి వెళ్లిపోయారని చెప్తాడు. గణ సంతోషిస్తూ లైఫ్‌లో వాళ్లు నాకు కనిపించకూడదు అంటాడు. దాంతో పరంధామ్ గణతో మేం పెట్టిన టార్చర్‌కి మీ మాటలకు చచ్చిపోతారు సార్ అని అంటాడు. గణ తన తల్లితో విషయం చెప్తాడు. ఈశ్వరి కొడుకుతో ప్రేరణ ధైర్యం చూస్తుంటే అనుమానంగా ఉందని దాని మాట తీరు కళ్లారా చూశాను కదా అంత సులువుగా వైజాగ్ వదిలి వెళ్లిపోయేలా లేదు అది పట్టుదలకు కేర్ ఆఫ్ అడ్రస్‌లా ఉందని అంటుంది. దానికి గణ నేను వాళ్ల పుట్టుక మీద నింద వేశాను వాళ్ల ఆత్మహత్య చేసుకుంటారని అంటాడు.
ప్రేరణ కంటిన్యూగా కాల్ చేయడంతో సిద్ధూ స్నానం చేసి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు. రాజశేఖరం కూతురు అని ప్రేరణ చెప్పగానే గణ సిద్ధూని యాక్సిడెంట్ నువ్వే చేశావా అని వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు. ప్రేరణ అడ్రస్ అడగటంతో సిద్ధూ ప్రేరణ మీద సీరియస్ అవుతాడు. మీ అన్న అడ్రస్ మీకు తెలీకపోవడం ఏంటి మీ అన్న వార్నింగ్ ఇస్తాడు మీరు అడ్రస్ అడుగుతారు. నన్ను ఇబ్బంది పెడితే బాగోదు అని సిద్ధూ కాల్ కట్ చేస్తాడు. దాంతో ఏం చేయాలా అని ప్రేరణ బాధపడుతుంది. ఇంతలో తల్లి, చెల్లితో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటుంది.
ఇందు చాలా భయపడుతుంది. గణేశ్ పోలీస్ కదా వాడి మీద కంప్లైంట్ ఇస్తే మనల్ని బతకనిస్తాడా అని కంగారు పడుతుంది. మనకు వేరే దారి లేదు వాడి మీద ముందు మిస్సింగ్ కేసు పెట్టాలని అంటుంది. ఇందు కూతురితో మన ఊరు వచ్చి బెదిరించిన వాడు వాళ్ల ఊరిలో వాడి మీద కంప్లైంట్ ఇస్తే ఊరుకుంటాడా అని అంటుంది. నాన్న జాడ మనకు తెలియాలి అప్పటి వరకు ఊరుకునేదే లేదని అంటుంది.ముగ్గురు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. ఇందు చాలా భయపడుతుంది. కంప్లైంట్ వద్దు అంటుంది. దాంతో ప్రేరణ, ఐశ్వర్య తల్లికి ధైర్యం చెప్పి బయటే ఉండమని మేం కంప్లైంట్ ఇచ్చి వస్తామని వెళ్తారు.
సుధాకర్ అనే కానిస్టేబుల్ గణేశ్‌ని తిట్టుకుంటాడు. నా మొగుడు నన్ను బతనివ్వడు అని అంటాడు. ఇంతలో గణ సుధాకర్‌కి కాల్ చేసి ఓ క్రైమ్‌కి సంబంధించిన రిపోర్ట్స్ తీసుకురాలేదని గణ కేకలేస్తాడు. గణ టార్చర్కి బీపీ ట్యాబ్లెట్స్ కూడా పని చేయడం లేదని అనుకుంటాడు. ఇంతలో ప్రేరణ వాళ్లు వచ్చి మానాన్న కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తారు. సుధాకర్ డిటైల్స్ అడుగుతారు. మీ నాన్నని ఎవరు కిడ్నాప్ చేశారని అడిగితే గణేశ్ పేరు చెప్పగానే సుధాకర్ బిత్తరపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!