IBPS PO Result 2023:
దేశంలోని వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 3049 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ సెప్టెంబరు 23, 30; అక్టోబరు 1న 'ప్రిలిమ్స్' పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఐబీపీఎస్ అక్టోబరు 18న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి ఫలితాలను చూడవచ్చు. అక్టోబరు 26 వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తర్వాతి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇలా చెక్ చేయండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట ఐబీపీఎస్ వెబ్‌సైట్ సందర్శించాలి.
➥ అక్కడ హోంపేజీలో కనిపించే ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ ఫలితాల కోసం CRP PO/MT-XIII results లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ లాగిన్ పేజీలో అవసరమైన వివరాలు నమోదు చేసి సమర్పించాలి.
➥ అభ్యర్థుల స్కోర్ వివరాలతో కూడిన ఫలితాలు కనిపిస్తాయి. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.
IBPS PO Results: ఐబీపీఎస్ పీవో ఫలితాల కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) సెప్టెంబరు 30న నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు సెప్టెంబరు 23, 30; అక్టోబరు 1న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది.
మెయిన్స్ పరీక్ష విధానం:
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ | 45 | 60 | 60 నిమిషాలు |
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ | 40 | 40 | 35 నిమిషాలు |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 35 | 40 | 40 నిమిషాలు |
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ | 35 | 60 | 45 నిమిషాలు |
మొత్తం | 155 | 200 | 3 గంటలు |
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
నాసిక్- కరెన్సీ నోట్ ప్రెస్‌లో 117 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
మహారాష్ట్ర నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ సూపర్‌వైజర్, ఆర్టిస్ట్, సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 117 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులు - ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలు
బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్), తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 1 వరకు దరఖాస్తులు సమర్పించి, నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..