దేశంలోని పలు ప్రభుత్వ బ్యాంకుల్లో 6932 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఏప్రిల్ 1న ప్రకటించింది. అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి తుది ఫలితాలను చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా గతేడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్‌ను, నవంబర్‌లో మెయిన్స్ పరీక్షలను ఐబీపీఎస్ నిర్వహించింది. ఇంటర్వ్యూ అనంతరం ఐబీపీఎస్ ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి
ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట ఐబీపీఎస్ వెబ్‌సైట్ సందర్శించాలి. - https://www.ibps.in/
➥ అక్కడ హోంపేజీలో కనిపించే ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలకు సంబంధించిన 'CRP PO/MTs-XII Results' లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ అభ్యర్థులకు సంబంధించిన తుది ఫలితాలకు సంబంధించిన పేపీ ఓపెన్ అవుతుంది.
➥ అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది వివరాలు నమోదు చేయాలి.
➥ అభ్యర్థులకు సంబంధించిన తుది ఫలితాలు చూసుకోవచ్చు.
ఐబీపీఎస్ పీవో తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
దేశంలోని పలు ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఏప్రిల్ 1న ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా గతేడాది డిసెంబరులో ప్రిలిమ్స్, జనవరిలో మెయిన్స్ పరీక్షలను ఐబీపీఎస్ నిర్వహించింది. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలను ఐబీపీఎస్ ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
దేశంలోని వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ఏప్రిల్ 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఐబీపీఎస్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించిన లింక్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా క్లర్క్ నియామక ప్రధాన పరీక్షలను గతేడాది అక్టోబర్‌లో ఐబీపీఎస్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!
ఆర్ఈసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్/ బీటెక్/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చివరితేది ఏప్రిల్ 15గా నిర్ణయించారు.
నోటిఫికేషన్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..