TSPSC Game Changer :    తెలంగాణ రాజకీయాల్లో నిన్నా మొన్నటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాంపై రచ్చ జరిగింది. కానీ హఠాత్తుగా సీన్ అంతా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారమే నడుస్తోంది. నిజానికి కవిత ఇష్యూతో  బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టవచ్చు కానీ నేరుగా ప్రజలపై ప్రభావం చూపదు. కానీ టీఎస్‌పీఎస్సీ వ్యవహారం మాత్రం అలా కాదు. నేరుగా ప్రజలపై చూపిస్తుంది. యువతలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి కన్నా.. ఎక్కువగా టీఎస్‌పీఎస్సీ లీకేజీల గురించే పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ దూసుకెళ్తున్నాయి. ఈ అంశంపైనే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాయి. 


టీఎస్‌పీఎస్సీ అంశంపై దృష్టి పెట్టిన కాంగ్రె్స ! 


ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. కాంగ్రెస్‌ పార్టీ నిత్యం జనం లో ఉండే విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకుం టోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్‌గా కార్య క్రమాలు చేపట్టి.. ఆ రెండు పార్టీలకు తామే ప్రత్యా మ్నాయమని చూపెట్టా లనే ఆలోచనతో మందు కెళ్లేందు కు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంసిద్ధుల వుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్లి.. పార్టీ నాయకు లందరూ కార్యక్రమాల్లో భాగస్వా మ్యులయ్యేలా చూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే ఇప్పటీకే పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయానికి కృషి చేస్తున్నారు.  ఇప్పటికే హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ కార్య క్రమంలో భాగంగా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు పాద యాత్రలు చేస్తుం డగా, ఇక ప్రజా సమస్యలపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎప్పటి కప్పుడు స్పందించేలా నిర్ణయాలు తీసుకుం టున్నారు.


విద్యార్థి సంఘాలను కలుపుకుని భారీ ఉద్యమానికి ప్లాన్ ! 


 టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమ కార్యాచరణను తీసుకుంటోంది. విద్యార్థి, నిరుద్యో గులతో పాటు వివిధ సంఘాలు, పార్టీలతో కలిసి క్షేత్ర స్థాయిలో ఉద్యమించేందుకు సిద్ధం అవు తోంది. అందుకు టీ పీసీసీ సీనియర్‌ ఉపా ధ్యక్షులు, మాజీ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియ మించగా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్‌-1, ఇతరాత్ర పరీక్షలకు దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తు న్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కష్టపడి సాధించు కోవాలని.. లక్షల మంది నిరుద్యోగులు సిరియ్‌స్‌గానే ప్రిపేర్‌ అవుతున్నారు. ఈ పేపర్‌ లీకేజీ వల్ల.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు నిరాశ, నిస్రృలకు లోనయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపైన నిరుద్యోగులు కోపంగా ఉండి తమ వ్యతిరేకతను బహటంగానే వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల్లో ఉన్న ఈ వ్యతిరేకతను క్యాచ్‌ చేసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులున్నారు. 


టీఎస్‌పీఎస్సీ కేసునే హైలెట్ చేస్తున్న బీజేపీ ! 


బీజేపీ  కూడా ధీటు గానే కార్యక్రమాలు చేపడుతోంది. లీకేజీ  బయటపడిన రోజున బీజేపీ నేతలే ఎక్కువ ఉద్యమం చేశారు. కేసుల పాలై బీజేపీ కార్యకర్తలు జైలుకు కూడా వెళ్లారు. తర్వాత కాంగ్రెస్ ముందుకు వచ్చినప్పటికీ..  బీజేపీ మాత్రం తగ్గడం లేదు. పోరాటం ఉద్దృతంగా చేస్తోంది. యువతను పూర్తి స్థాయిలో ఆకట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కేలా చేస్తే విజయం సులువు అవుతుందని రెండు పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఆ దిశగా కార్యాచరణను ఖరారు చేసుకుంటున్నాయి. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్ని టీఎస్‌పీఎస్సీ కేసు మార్చేసిందని అనుకోవచ్చు.