ఆర్థరైటిస్ అనేది వయసు, లింగంతో సంబంధం లేకుండా ప్రభావితం చేసే చాలా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిని ఎక్కువగా ప్రభావితం చేసేది. కానీ ఇది ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ప్రబలంగా కనిపిస్తుంది. గణాంకాల ప్రకారం 54 మిలియన్ల పెద్దలు ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. 3 లక్షల మంది పిల్లలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు మీలోనూ కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
జాయింట్స్ నొప్పులు
ఆర్థరైటిస్ అత్యంత సాధారణ సంకేతం కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనంగా మారిపోయి సౌకర్యంగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువ గంటలు కూర్చున్నప్పుడు ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నొప్పులు దీర్ఘకాలికంగా మారింతే ఆస్టియో ఆర్థరైటిస్ కి దారి తీసే ప్రమాదం ఉంది. దీన్ని తీవ్రంగా పరిగణించాలి.
బొటన వేళ్ళలో నొప్పి
కాలి బొటన వెలులో చాలా నొప్పిగా ఉన్నప్పుడు అది దీర్ఘకాలికంగా మారుతుంది. ఆర్థరైటిస్ ఇది మరొక సంకేతం. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం బొటన వేలు తాకడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తే అసలు ఆలస్యం చేయొద్దు.
వేళ్ళలో గడ్డలు
ఫింగర్స్ లో గడ్డలు ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ రెండింటిలోనూ సంభవిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ లో అరిగిపోయిన మృదులాస్థి కారణంగా అస్థి స్పర్స్ ఏర్పడతాయి. రుమటాయిడ్ లో గడ్డలు పాదలు, చేతులపై సమానంగా ఉంటాయి. వీటిని హెబెర్డ్ న్ నోడ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి బఠానీ పరిమాణంలో అస్థి పెరుగుదలకు కారణమవుతుంది. వేలు కొనకు దగ్గర ఉన్న భాగాల మీద ఈ గడ్డలు ఏర్పడతాయి. ఇవి చాలా బాధకరమైన లక్షణాలు కలిగి ఉంటుంది. ఒక్కోసారి చలనం కోల్పోతాయి. వేళ్ళు గట్టిగా మారిపోతాయి. మూతలు తీయడం, షర్ట్ బటన్స్ పెట్టుకోలేకపోవడం వంటి రోజువారీ పనులు చేయడంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది.
నిద్రపట్టడంలో ఇబ్బంది
కీళ్ల నొప్పులు వచ్చినప్పుడు నిద్రకి తీవ్ర ఆటంకం కలుగుతుంది. నిద్రపోవడం చాలా కష్టంగా మారుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రలేకపోవడం మరింత నొప్పికి దారి తీస్తుంది. ఎందుకంటే నిద్రలేమి వాపుని పెంచుతుంది. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం ఈ పరిస్థితి ఉన్న వారిలో 80 శాతానికి పైగా ప్రజలు నొప్పి, వాపు కారణంగా నిద్రపోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలసట
అలసటతో ఉన్న వ్యక్తులు తరచుగా ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. శరీరం, అవయవాలు బరువుగా కదలడానికి కష్టంగా అనిపిస్తాయి. రోజంతా నీరసంగా అనిపిస్తుంది. శక్తి తగ్గిపోయిన ఫీలింగ్ ఉంటుంది.
సోరియాసిస్
సోరియాసిస్ అనేది చర్మంపై ఉండే కణాల జీవిత చక్రాన్ని పెంచే ఒక చర్మ పరిస్థితి. దీని వలన చర్మ కణాలు ఉపరితలంపై నిర్మించబడతాయి. సోరియాసిస్ ఉన్న వ్యక్తులు తరచుగా సోరియాటిక్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. దీని వల్ల కీళ్ళు వాపులు, గట్టిపడటం బాధకారంగా ఉంటాయి. సోరియాసిస్ మాదిరిగానే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలిక పరిస్థితి. ఇది క్రమంగా అధ్వానంగా మారిపోతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే