దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్‌ 14న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు పొందవచ్చు. సెప్టెంబరు 21 వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. తదనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఆగస్టు 26, 27, సెప్టెంబర్‌ 2 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి చర్యలు చేపడుతోంది. ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.


మెయిన్ పరీక్ష: మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి 190 ప్రశ్నలు అడుగుతారు. వీరిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, 35 నిమిషాల వ్యవధి; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు 35 నిమిషాల వ్యవధి; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు 45 నిమిషాల వ్యవధి; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు 45 నిమిషాల వ్యవధిలో.. అంటే మొత్తంగా మెయిన్ పరీక్ష 190 ప్రశ్నలు-200 మార్కులకు 160 నిమిషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.


ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్.
 
ALSO READ:


రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నిమ్స్‌లో 65 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..