IBPS Jobs 2023: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల దరఖాస్తు గడువు ఆగస్టు 21తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు గడువును మరోవారంపాటు పొడిగిస్తూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఆగస్టు 28లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ-XIII 2024-25) నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

పోస్టుల వివరాలు..

* ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు: 3049 పోస్టులు

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:

➥ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2000

➥ కెనరా బ్యాంక్: 500

➥ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 224

➥ పంజాబ్ నేషనల్ బ్యాంక్: 200

➥ పంజాబ్ సింధ్ బ్యాంక్: 125

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వ‌యోపరిమితి: 01.08.2023 నాటికి 20 - 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.1993 - 01.08.2003 మధ్య జన్మంచి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బారినపడిన వారికి 5 సంవత్సరాల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి.

ఎంపిక‌ విధానం: ప్రిలిమనరీ, మెయిన్స్ రాతపరీక్షలు; ఇంట‌ర్వ్యూ ద్వారా.

ప్రిలిమ్స్ పరీక్ష విధానం:

విభాగం  ప్రశ్నలు  మార్కులు   సమయం
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 30 20 నిమిషాలు
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 35 20 నిమిషాలు
రీజినింగ్ ఎబిలిటీ 35 35 20 నిమిషాలు
మొత్తం  100 100 60 నిమిషాలు

మెయిన్స్ పరీక్ష విధానం:

విభాగం  ప్రశ్నలు  మార్కులు   సమయం
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌  45 60 60 నిమిషాలు
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌  40 40 35 నిమిషాలు
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌   35 40 40 నిమిషాలు
డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 60 45 నిమిషాలు
మొత్తం  155 200 3 గంటలు

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ‌ ప్రారంభం: 01.08.2023

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.08.2023 (28.08.2023 వరకు పొడిగించారు)

➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌: సెప్టెంబ‌ర్‌ 2023

➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబ‌ర్‌ 2023

➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: సెప్టెంబ‌ర్‌ 2023

➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష: సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2023

➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: అక్టోబరు 2023

➥ మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: అక్టోబరు/న‌వంబ‌రు 2023

➥ మెయిన్ ఎగ్జామ్: న‌వంబ‌రు 2023

➥ మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు: డిసెంబ‌రు 2023

➥ ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2024

➥ ఇంట‌ర్వ్యూ: జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2024

➥ నియామకం: ఏప్రిల్ 2024

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..