AP DSC Vacancies 2025: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఏ క్షణమైన అధికారిక ప్రకటన రానుంది. గత ఏడాది నుంచి జరుగుతున్న సస్పెన్స్‌కు తెరపడబోతోంది. 16వేలకుపైగా పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ భర్తీ చేయనుంది. మరోవైపు ప్రత్యేక ఉపాధ్యాయ ఉద్యోగాలను కూడా మరో నోటిఫికేషన్‌తో భర్తీ చేయనుంది. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 2024లోనే ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారో కూడా చెప్పేశారు. ఆ వివారాలు ఇక్కడ ఉన్నాయి.                                ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ పాఠశాలలో ఉన్న ఖాాళీల వివరాలు ఇవే  

క్రమ సంఖ్య జిల్లా పేరు (ఉమ్మడి జిల్లాలు)స్కూల్ అసిస్టెంట్‌(ఫస్ట్ లాంగ్వేజ్‌)స్కూల్ అసిస్టెంట్‌(సెకండ్ లాంగ్వేజ్‌)స్కూల్ అసిస్టెంట్‌  ఇంగ్లీష్‌స్కూల్ అసిస్టెంట్‌ గణితం స్కూల్ అసిస్టెంట్‌ ఫిజికల్ సైన్స్స్కూల్ అసిస్టెంట్‌ బయలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్‌ సోషల్ స్కూల్ అసిస్టెంట్‌ ఫిజికల్ ఎడ్యుకేషన్ఎస్జీటీమొత్తం పోస్టులు 
1శ్రీకాకుళం 341164331432668172407
2విజయనగరం 121419832195862146370
3విశాఖపట్నం 24285257365288139149625
4తూర్పుగోదావరి 5375886168951182102581026
5పశ్చిమగోదావరి35457737385897178160725
6కృష్ణ 35238848531401301224561095
7గుంటూరు355461325782102166306895
8ప్రకాశం 3023949224701067280591
9నెల్లూరు 37178362756210210572615
10చిత్తూరు3712100292860125868281305
11కడప 1916784134486077240613
12అనంతపురం 35269940627010614380661
13కర్నూలు791137890667211220617312547
 మొత్తం పోస్టులు 46545798163058786012701647457811475

               మున్సిల్ పాఠశాలలో ఉన్న ఖాళీల వివరాలు ఇవే  

క్రమ సంఖ్య జిల్లా పేరు (ఉమ్మడి జిల్లాలు)స్కూల్ అసిస్టెంట్‌(ఫస్ట్ లాంగ్వేజ్‌)స్కూల్ అసిస్టెంట్‌(సెకండ్ లాంగ్వేజ్‌)స్కూల్ అసిస్టెంట్‌  ఇంగ్లీష్‌స్కూల్ అసిస్టెంట్‌ గణితం స్కూల్ అసిస్టెంట్‌ ఫిజికల్ సైన్స్స్కూల్ అసిస్టెంట్‌ బయలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్‌ సోషల్ స్కూల్ అసిస్టెంట్‌ ఫిజికల్ ఎడ్యుకేషన్ఎస్జీటీమొత్తం పోస్టులు 
1శ్రీకాకుళం 311001513951
2విజయనగరం 415001226176
3విశాఖపట్నం 104723106067109
4తూర్పుగోదావరి 297113611203118208
5పశ్చిమగోదావరి143884157260310
6కృష్ణ 20997635450113
7గుంటూరు266941593185248
8ప్రకాశం 1221201021838
9నెల్లూరు 1231150013053
10చిత్తూరు129841981116168
11కడప 1423313635792
12అనంతపురం 109445265101146
13కర్నూలు1124344466098
 మొత్తం పోస్టులు 177587141365176381162110

చాలా కాలంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ కాకపోవడంతో నిరుద్యోగులు చాలా ఆశగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఉద్యోగ అర్హత ఏజ్‌ లిమిట్‌ను కూడా ప్రభుత్వం పెంచింది. రెండు రోజుల క్రితం ప్రత్యేక జీవోను తీసుకొచ్చి 42 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచారు.

నోటిఫికేషన్‌లో కూడా చాలా మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి వివిధ స్కూళ్ల ఆప్షన్స్‌ను నోటిఫికేషన్‌లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా సర్టిఫికెట్లు కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంది.