HCL Recruitment: కోల‌్‌కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 56 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 56 

విభాగాలవారీగా ఖాళీలు..

⏩ మైనింగ్: 46 పోస్టులు

అర్హత: మైనింగ్‌లో డిప్లొమాతోపాటు సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి లేదా మైనింగ్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. మెటాలిఫెరస్ గనుల కోసం ఫోర్‌మాన్ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ(అన్‌రిస్ట్రిక్టెడ్). మెటలిఫెరస్ మైన్ (అపరిమితం) కోసం రెండవ-తరగతి మేనేజర్ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ. 

వయోపరిమితి: 01.06.2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రిమీ లేయర్) 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ – (జనరల్ /ఈడబ్ల్యూఎస్ 10 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రిమీ లేయర్) 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 15 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ ఎలక్ట్రికల్: 06 పోస్టులు

అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీర్‌లో డిప్లొమాతో పాటు సంబంధిత రంగంలో 5 సంవత్సరాల అనుభవం. లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 01.06.2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రిమీ లేయర్) 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ – (జనరల్ /ఈడబ్ల్యూఎస్ 10 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రిమీ లేయర్) 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 15 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ కంపెనీ సెక్రటరీ: 02 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌తో పాటు 5 సంవత్సరాల అనుభవం. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా / యూకే ఫైనల్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01.06.2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రిమీ లేయర్) 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ – (జనరల్ /ఈడబ్ల్యూఎస్ 10 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రిమీ లేయర్) 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 15 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ ఫైనాన్స్: 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌తో పాటు 5 సంవత్సరాల అనుభవం. లేదా సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ & వర్క్స్ అకౌంటెంట్ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. లేదా ఫైనాన్స్‌లో పీజీ డిగ్రీ/ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా/ఫైనాన్స్‌లో ఎంబీఏతోపాటు సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.06.2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రిమీ లేయర్) 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ – (జనరల్ /ఈడబ్ల్యూఎస్ 10 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రిమీ లేయర్) 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 15 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ హెచ్‌ఆర్: 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌తో పాటు 5 సంవత్సరాల అనుభవం. లేదా సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవంతో పాటు హెచ్‌ఆర్‌లో హెచ్‌ఆర్/ఎంబీఏలో హెచ్‌ఆర్/పీజీ డిప్లొమాలో పీజీ డిగ్రీ.

వయోపరిమితి: 01.06.2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రిమీ లేయర్) 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ – (జనరల్ /ఈడబ్ల్యూఎస్ 10 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రిమీ లేయర్) 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 15 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఇతర అభ్యర్థులందరికీ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

పే స్కేల్: నెలకు రూ.30,000- రూ.1,20,000.

ముఖ్యమైనతేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2024.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.07.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...