HAL Recruitment: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షార్ట్ టర్మ్ ప్రాతిపదికన జూనియర్ స్పెషలిస్ట్, మిడిల్ స్పెషలిస్ట్, సీఎంఎం (లెవల్-5) ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంతో నవంబరు 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 24
⏩ జూనియర్ స్పెషలిస్ట్: 08
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పూర్తి టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) లేదా మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్ లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 29.11.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీలకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
⏩ మిడిల్ స్పెషలిస్ట్: 12
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పూర్తి టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) లేదా మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఏరోనాటికల్/కెమికల్/మెటలర్జీ లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు 4 నుంచి 8 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 29.11.2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీలకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
⏩ సీఎంఎం (లెవల్-5) ఇంజినీర్ : 04
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పూర్తి టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) లేదా కంప్యూటర్ సైన్స్ & ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు 8 నుంచి 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 29.11.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీలకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: నెలకు సీఎంఎం పోస్టుకు రూ.60,000; మిడిల్ స్పెషలిస్ట్ పోస్టుకు రూ.50,000; జూనియర్ పోస్టుకు రూ.40,000.
ముఖ్యమైన తేదీలివే..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.11.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.11.2024.
ALSO READ:
➥ ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
➥ యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,883 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి