YANTRA INDIA LIMITED RECRUITMENT: భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్‌, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 58వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 3,883 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఐటీఐ, నాన్‌ ఐటీఐ అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. అక్టోబర్‌ 22న ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబర్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు. 


వివరాలు..


* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 3,883.


పోస్టుల కేటాయింపు: ఐటీఐ-2498; నాన్ ఐటీఐ-1385.


ఫ్యాక్టరీలవారీగా ఖాళీలు..



  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ(నలంద, బిహార్): 20 పోస్టులు 

  • ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ(చండీగఢ్):  11 పోస్టులు 

  • గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ (జబల్‌పూర్, మధ్యప్రదేశ్): 209 పోస్టులు  

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ(జబల్‌పూర్, మధ్యప్రదేశ్): 48 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ(ఇటార్సీ, మధ్యప్రదేశ్): 43  పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ(ఖమారియా-జబల్‌పూర్, మధ్యప్రదేశ్): 452 పోస్టులు 

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (కట్ని, మధ్యప్రదేశ్): 87  పోస్టులు

  • హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ (కిర్కీ,పుణే-మహారాష్ట్ర): 75 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (అంబఝరి, నాగ్‌పూర్-మహారాష్ట్ర): 343 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (అంబర్‌నాథ్‌, మహారాష్ట్ర): 80 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (భండారా, మహారాష్ట్ర): 251 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (భూసవాల్, మహారాష్ట్ర): 83 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (చంద్రాపూర్, మహారాష్ట్ర): 461 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (డెహూరోడ్-పుణే, మహారాష్ట్ర): 112 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (వరంగన్, మహారాష్ట్ర): 144 పోస్టులు

  • అమ్యునిషన్ ఫ్యాక్టరీ (కడ్కీ-పుణే, మహారాష్ట్ర): 73 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (బద్మల్, ఒరిస్సా): 135 పోస్టులు

  • కార్డైట్ ఫ్యాక్టరీ (అర్వన్‌కాడు, తమిళనాడు): 47 పోస్టులు

  • హై ఎనర్జీ ప్రాజెక్టైల్ ఫ్యాక్టరీ(తిరుచిరాపల్లి, తమిళనాడు): 75 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (మురాద్ నగర్, ఉత్తర్ ప్రదేశ్): 179 పోస్టులు

  • స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీ (కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్): 139 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (డెహ్రాడూన్, ఉత్తరాఖండ్): 69 పోస్టులు

  • ఆప్టో ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీ (డెహ్రాడూన్, ఉత్తరాఖండ్): 86 పోస్టులు

  • గన్  అండ్ షెల్ ఫ్యాక్టరీ (కాసీపోర్, పశ్చిమ్‌బంగా): 122 పోస్టులు

  • మెటల్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ (ఈశాపూర్, పశ్చిమ్‌బంగా): 211 పోస్టులు

  • ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ (డమ్-డమ్, పశ్చిమ్‌బంగా): 52 పోస్టులు


ట్రేడులు: మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడ్‌లు. 


అర్హత: నాన్-ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. ఇక నాన్-ఐటీఐ అభ్యర్థులైతే కనీసం 50 మార్కులతో పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. 


స్టైపెండ్: నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000; ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు.


ముఖ్యమైన తేదీలు.. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 21.11.2024. (23:59 Hours)


Notification


Trade Apprenticeship at Indian Ordnance Factories Application Portal


Online Application


ALSO READ: గార్డెన్ రిసెర్చ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌లో 230 అప్రెంటిస్ పోస్టులు


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..