Ammayi garu Serial Today Episode రూప, రాజులు జీవన్ వాళ్ల దగ్గరకు వస్తారు. గౌతమ్, రేణుకల ప్రేమ పెళ్లి గురించి తెలిసి చాలా సంతోషంగా ఉన్నామని కంగ్రాట్స్ అని చెప్తారు. రాజు సెటైరికల్‌గా రేణుక ముఖంలో ప్రేమ పెళ్లి చేసుకున్న సంతోషమే లేదని అంటాడు. కనీసం గొర్రెని పెళ్లి చేసుకున్నంత గౌరవం కూడా లేదు అంటాడు.


గౌతమ్: ఏయ్ మర్యాదగా మాట్లాడురా.
రాజు: కూల్ మ్యాన కూల్. అయినా నువ్వేంట్రా జీవన్ మాపెద్దయ్య మీద కుట్రలేంట్రా.
జీవన్: కుట్ర చేయాల్సిన అవసరం నాకేంటి.
రూప: రాజు పాపం బ్యాలెట్ బాక్స్‌లు దొంగిలించినా గెలవలేదు అంటే ఏమై ఉంటుంది రాజు.
రాజు: వాళ్లకి తెలిసింది బ్యాలెట్ బాక్సులు దొంగిలించడం మాత్రమే.
జీవన్: రేయ్ మీరేం మాట్లాడుతున్నారు మేం దొంగతనం చేయడం ఏంటి.
రాజు: గెలవడానికి ఏమైనా చేయొచ్చు దొంగ తనం కూడా చేయొచ్చు కానీ దొంగతనం చేసివి ఏంటో తెలుసుకోవాలి కదా.అందులో చిత్తు కాగితాలే ఉన్నాయి.
జీవన్: మోసపోయాం
రూప: పోనీలే రాజు ఈ దొంగతనం వల్ల అయినా రేణుక గౌతమ్‌లు ఓ ఇంటి వారు అయ్యారు. 


గౌతమ్ మీడియాకు దొరికి పోయి రేణుక మెడలో తాళి కడుతున్నప్పుడు వెనక నుంచి రాజు రూపలు బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లిపోవడం గురించి చెప్తారు. ఇంకో సారి మా విషయంలో కలుగజేసుకుంటే క్షమించనని వార్నింగ్ ఇస్తాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని రూప చెప్పి వాళ్లని రెచ్చగొడుతుంది. నలుగురు రగిలిపోతారు. ఇక సూర్యప్రతాప్ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు జరుగుతాయి. విరూపాక్షి, రాజులను రూప, చంద్రలు స్వాగతం పలుకుతారు. మరోవైపు జీవన్ వాళ్లు నేను చేయాల్సిన ప్రమాణ స్వీకారం సూర్యప్రతాప్ చేస్తున్నారని సూర్య ఫ్యామిలీని టార్గెట్‌ చేయాలి అంటే మనకు సపోర్టు చేసే ఒకరు ఉండాలని అంటాడు. దానికి రేణుక రాజు తమ్ముడితో ఆ ఇంటి ఆడపిల్ల పీకల్లోతు ప్రేమలో ఉందని వాళ్లిద్దరినీ మన వైపు తిప్పుకుందామని అంటుంది రేణుక. 


సూర్యప్రతాప్ వస్తాడు అందరూ జేజేలు కొడతాడు. రాజు, విరూపాక్షిని సూర్యప్రతాప్ కోపంగా చూస్తాడు. వాళ్లు ఎందుకు వచ్చారని చంద్రని అడుగుతాడు. పబ్లిక్ మీటింగ్ అని చెప్తాడు చంద్ర దాంతో సూర్యప్రతాప్ సర్లే అని రూపని పక్కన కూర్చొపెట్టుకుంటాడు. ఇక రేణుక చెప్పిన ప్రేమికులు గోపి, పింకిలు కలుసుకొని సెల్ఫీలు తీసుకుంటారు. తన పెద్దనాన్న ప్రమాణ స్వీకారం ఉందని చెప్పి వెళ్తానంటే గోపి ఈ రోజు తన పుట్టినరోజు అని చెప్తాడు. ఇక గిఫ్ట్ ఏం లేదని హగ్ ఇచ్చి పింకి బయల్దేరుతుంది. మరోవైపు ప్రమాణ స్వీకారం చేయడానికి వేదిక మీదకు వెళ్తాడు. ఇక పింకి గోపికి హగ్ ఇస్తుంటే పోలీసులు, మీడియాలో రేణుక, శ్వేత, గౌతమ్‌లు వస్తారు. వాళ్లు నిజంగానే పోలీసులు అనుకొని భయపడతారు. పార్కుల్లో హగ్గు చేసుకోవడానికి సిగ్గు లేదా అంటారు. ఇక పింకి సీఎం గారి తమ్ముడు కూతురు అని గుర్తు పట్టినట్లు నటిస్తారు. ఇక గోపి బ్యాగ్ చెక్ చేసి అందులో డ్రగ్స్ తీసి సీఎం తమ్ముడి కూతురికి డ్రగ్స్ ఇస్తావా అని అంటాడు. తనకు ఏం సంబంధం లేదని గోపి పారిపోతాడు.


మరోవైపు సూర్యప్రతాప్ సీఎంలా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇక పింకి బ్యాగ్‌ కూడా చెక్ చేసి వాళ్ల జేబులు నుంచి డ్రగ్స్ తీసి పింకికి వాటి స్మెల్ చూడమంటారు. ఇక సూర్య ప్రతాప్ ఓటర్లందరకీ ధన్యవాదాలు చెప్తాడు. తన కూతురు రూప తన గెలుపునకు ఎక్కువ కష్టపడిందని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను, లక్కీలకు ప్రత్యక్షమైన ఆంజనేయస్వామి.. కంపెనీ కోసం పాట్లు!