Google is bringing back face-to-face job interviews : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలతో విస్తృతంగా జరుగుతున్న చీటింగ్ కారణంగా గూగుల్ ఫేస్-టు-ఫేస్ జాబ్ ఇంటర్వ్యూలను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. వర్చువల్ ఇంటర్వ్యూలు వీడియో కాల్స్ లేదా ఆన్‌లైన్ ఇంటర్యూల్లో విపరీతంగా మోసం చేస్తున్నట్లుగా గుర్తించారు. Google రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో AI ఉపయోగం పెరగడంతో ఇంటర్యూకు వచ్చే వారుకూడా. AI పవర్డ్ చీటింగ్ విస్తృతంగా చేస్తున్నారు. అందుకే మేము ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూలు తిరిగి తీసుకువస్తున్నామని సుందర్ పిచాయ్ ప్రకటించారు.
Google కరోనా సమయం నుంచి వర్చువల్ ఇంటర్వ్యూలకు మారింది. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాదు ఖర్చు ఆదా చేసింది. కానీ, 2023-2024లో AI టూల్స్ ChatGPT, Deepfake వంటి వాటితో చీటింగ్ పెరిగింది. చాలా మందికి స్కిల్స్ లేకపోయినా ఏఐని ఉపయోగించి మోసం చేస్తున్నారు. Google ప్రతి ఏడాది 2 మిలియన్‌కి పైగా జాబ్ అప్లికేషన్లు ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రక్రియలో ఇంటర్యూ అత్యంత కీలకం.
అభ్యర్థులు వీడియో ఇంటర్వ్యూలలో AI ద్వారా రియల్-టైమ్ సహాయం తీసుకుంటున్నారు. ChatGPT లేదా Gemini వంటి టూల్స్‌తో ప్రశ్నలకు ఆన్‌లైన్ రిస్పాన్స్‌లు తీసుకుంటున్నారు. AI ద్వారా ముఖాలు మార్చి ఒకరి స్థానంలో మరొకరు స్థానంలో పాల్గొంటున్నారు. ఒకరు ప్రశ్నలు చదివి, AI ముఖం ద్వారా సమాధానాలు చెప్పడం చేస్తున్నారు. చిన్న ఇయర్‌బడ్స్ ద్వారా బయటి వ్యక్తి సహాయం తీసుకోవడం, వంటివి చేస్తున్నారు. రాను రాను రాను ఇలాంటివి పెరుగుతున్నాయి. LinkedIn , Indeed వంటి ప్లాట్‌ఫారమ్‌లలో 20-30 శాతంఇంటర్వ్యూలలో చీటింగ్ గుర్తిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలుచెబుతున్నాయి. Googleలో కూడా ఇలాంటి కేసులు పెరిగాయి. టెక్ , ఇంజనీరింగ్ రోల్స్‌లో పెరగడంతో.. ఫిజికల్ ఇంటర్యూలే మంచిదన్న భావనకు వస్తున్నారు.
ఇది Googleకి మాత్రమే కాకుండా, Microsoft, Amazon వంటి టెక్ జెయింట్స్‌కు కూడా సమస్య. చీటింగ్ చేస్తున్నట్లుగా గుర్తిస్తే అభ్యర్థి బ్లాక్‌లిస్ట్ లో పెడుతున్నారు. AIని చీటింగ్ డిటెక్ట్ చేయడానికి కూడా ఉపయోగించే టెక్నాలజీని కంపెనీలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విపరీతంగా ప్రపంచాన్ని మారుస్తుందని ప్రచారం జరుగుతోంది కానీ.. అది ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాక ముందేే తేలిపోతున్నసూచనలు కనిపిస్తున్నాయి. ఏఐ ద్వారా చేసే పనుల్లో ఏ మాత్రం సృజనాత్మకత ఉండకపోగా.. చిన్న సమస్యలు వస్తే.. మొత్తం ప్రాజెక్ట్ పాడైపోతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకా చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. అందుకే చాలా కంపెనీలు.. ఏఐ వినియోగంపై ఇప్పటికే.. ఆసక్తిని కోల్పోతున్నాయి.