Maruti Baleno Price, Down Payment, Car Loan EMI Details: మారుతి సుజుకి బ్రాండ్‌లో తక్కువ ధర, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్న కార్లలో ఒకటి మారుతి బాలెనో. ముఖ్యంగా, ఈ కారులో సంతృప్తికరమైన స్పేస్‌ & మంచి ఫీచర్ల కారణంగా కామన్‌ మ్యాన్‌కు ఇష్టమైన కారుగా మారింది. ఫ్రంట్ డిజైన్‌లో కొత్త గ్రిల్‌, షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌, బోల్డ్‌ బంపర్‌ వలన మారుతి బాలెనో ఇంకా స్టైలిష్‌గా మారింది. వెనుక వైపు స్ప్లిట్‌ LED టెయిల్‌ల్యాంప్స్‌, కొత్త బంపర్‌ వలన కారుకు ఫ్యూచరిస్టిక్‌ టచ్‌ వచ్చింది. అల్లాయ్ వీల్స్‌ స్పోర్టీ లుక్‌ ఇస్తుండా, డిజైన్‌ యూత్‌ఫుల్‌ ఫీలింగ్‌ ఇస్తుంది. ఇంటీరియర్‌లో మోడ్రన్‌ డాష్‌బోర్డ్‌, పెద్ద టచ్‌స్క్రీన్‌, స్మార్ట్‌ లేఅవుట్‌ వల్ల ఇది ఒక ప్రీమియం కారు అనిపిస్తోంది.

మారుతి బాలెనో, మొత్తం 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి - సిగ్మా, డెల్టా, డెల్టా CNG, డెల్టా AMT, జీటా, జీటా CNG, జీటా AMT & ఆల్ఫా.

తెలుగు రాష్ట్రాల్లో ధరఆంధ్ర, తెలంగాణలో మారుతి సుజుకి బాలెనో రేటు రూ. 6.74 లక్షల నుంచి రూ. 9.97 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. హైదరాబాద్‌లో, దాని బేస్ మోడల్ Sigma MT ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 8.13 లక్షలు. దీనిలో, దాదాపు రూ. లక్ష రిజిస్ట్రేషన్‌ ఫీజ్‌, దాదాపు రూ. 39,000 వేలు ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉంటాయి. విజయవాడలో ఈ కారు బేస్‌ మోడల్‌ ధర దాదాపు రూ. 8.12 లక్షలు.

తెలుగు రాష్ట్రాల్లో మీరు మారుతి సుజుకి బాలెనో ను కార్‌ లోన్‌ పై తీసుకోవచ్చు. అయితే, రూ. లక్ష డౌన్ పేమెంట్ దిల్లీలో సరిపోతుంది గానీ, మన తెలుగు రాష్ట్రాల్లో వర్కవుట్‌ కాదు, కనీసం రూ. లక్ష 40 వేలు కట్టాలి. మిగిలిన మొత్తానికి కార్‌ లోన్ తీసుకోవాలి. 

EMI లెక్కింపుఉదాహరణకు, విజయవాడలో మారుతి బాలెనోను కొనాలంటే, రూ. 1.40 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత, రూ. 6.72 లక్షల కార్‌ లోన్‌ తీసుకోవాలి. బ్యాంక్‌, ఈ మొత్తంపై 9% వార్షిక వడ్డీ రేటు వసూలు చేస్తుందని అనుకుందాం. EMI ఆప్షన్స్‌ చూద్దాం. 

7 సంవత్సరాల లోన్ వ్యవధి పెట్టుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 10,811 EMI చెల్లించాలి.

6 సంవత్సరాల్లో లోన్ క్లియర్‌ చేయాలంటే, మీరు ప్రతి నెలా రూ. 12,113 EMI చెల్లించాలి.

5 సంవత్సరాల్లో అప్పు నుంచి బయటపడాలంటే, మీరు ప్రతి నెలా రూ. 13,949 EMI చెల్లించాలి.

4 సంవత్సరాల రుణ వ్యవధి ఎంచుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 16,722 EMI చెల్లించాలి.

బ్యాంక్‌ మీకు కార్‌ లోన్‌ ఇవ్వడం, వడ్డీ రేటును నిర్ణయించడం వంటివి మీ క్రెడిట్‌ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి.

ప్రీమియం ఫీచర్లుమారుతి బాలెనో, లోన్‌ EMI లో మాత్రమే కాదు, మైలేజ్‌లోనూ పొదుపుగా ఉంటుంది. దీని డెల్టా (పెట్రోల్ + CNG) మోడల్‌లో, మీరు రెండు ట్యాంక్‌లను పూర్తిగా నింపితే సులభంగా 1000 కి.మీ. కంటే ఎక్కువ దూరం (కంపెనీ లెక్క ప్రకారం) ప్రయాణించవచ్చు. కారు క్యాబిన్‌లో 9-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్‌ చేస్తుంది. ఆర్కామిస్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & రియర్‌ AC వెంట్స్ వంటి ప్రీమియం ఫీచర్లను కూడా బడ్జెట్‌లో అందించారు.

ప్రయాణీకుల భద్రత కోసం, బాలెనోలో 6 ఎయిర్‌బ్యాగులు అమర్చారు. డ్రైవర్ సీటు ఎత్తును తగినట్లుగా సర్దుబాటు కూడా చేసుకోవచ్చు, ఇది కూడా ఒక ప్రీమియం ఫీచర్‌. అయితే, ఈ అధునాతన లక్షణాలన్నీ ఎక్కువగా టాప్ లేదా హై వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 

మీ బడ్జెట్‌లో మైలేజ్-ఫ్రెండ్లీ & ఫీచర్-లోడెడ్ కారు కోసం చూస్తున్నట్లయితే, మారుతి సుజుకి బాలెనో మీకు సరైన ఎంపిక. తక్కువ డౌన్‌ పేమెంట్‌ చేసి, సరైన రుణ వ్యవధిని ఎంచుకోండి, కొత్త బాలెనోలో ఫ్యామిలీతో కలిసి షికారు చేయండి.