Google Jobs: గూగుల్‌లో ఉద్యోగాలు, ఈ అర్హతలు తప్పనిసరి

గూగుల్ సంస్థ బెంగళూరులోని కార్యాలయంలో పనిచేయడానికి డేటా సైంటిస్ట్, క్లౌడ్ సేల్స్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Continues below advertisement

Google Recruitment: గూగుల్ సంస్థ బెంగళూరులోని కార్యాలయంలో పనిచేయడానికి డేటా సైంటిస్ట్, క్లౌడ్ సేల్స్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డేటా సైంటిస్ట్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ లేదా పీహెచ్‌డీ అర్హత, క్లౌడ్ సేల్స్ రెసిడెంట్ పోస్టులకు డిగ్రీ లేదా తత్సమాన ప్రాక్టికల్ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.

Continues below advertisement

పోస్టుల వివరాలు..

1)  డేటా సైంటిస్ట్ పోస్టులు

అర్హతలు: మాస్టర్స్ డిగ్రీ లేదా పీహెచ్‌డీ(స్టాటిస్టిక్స్/ బయోస్టాటిస్టిక్స్/ ఆపరేషన్స్ రిసెర్చ్/ ఫిజిక్స్/ ఎకనామిక్స్/ అప్లయిడ్ మ్యాథమెటిక్స్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. డేటా విభాగంలో ఇంటర్న్‌షిప్ లేదా పని అనుభవం ఉండాలి. స్టాటిస్టిక్స్‌తో క్వాంటిటేటివ్ మెథడాలజీస్ అనుభవం ఉండాలి.  స్టాటిస్టికల్ సాఫ్ట్‌వేర్ (R, Python, S-Plus, SAS, లేదా తత్సమాన) అనుభవం ఉండాలి.

ఇతర అర్హతలు..

➥ స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ విభాగంలో తగిన అనుభవం ఉండాలి. లీనియర్ మోడల్స్, మల్టీవేరియేట్ అనాలిసిస్, స్టాకాస్టిక్ మోడల్స్, శాంప్లింగ్ మెథడ్స్ తెలిసి ఉండాలి.

➥ లార్జ్ డేటాసెట్స్‌కు సంబంధించి మెషిన్ లెర్నింగ్‌లో అనుభవం ఉండాలి.

➥ డేటా అండ్ రెకమెండ్ యాక్షన్స్ నుంచి ఫలితాలను డ్రాయింగ్ చేయగలగాలి.

➥ ఇతరులకు బోధించే సామర్థ్యం, వేర్వేరు అవకలన గోప్యత నుంచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోగలగాలి.

➥ డేటా అనాలిసిస్ సమస్యలకు సంబంధించి సరైన స్టాటిస్టికల్ టూల్స్ ఎంచుకునే సామర్థ్యం ఉండాలి.

2) క్లౌడ్ సేల్స్ రెసిడెంట్

అర్హత: డిగ్రీ లేదా తత్సమాన ప్రాక్టికల్ అనుభవం. కస్టమర్ సర్వీస్, సేల్స్ లేదా కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్‌లో పని అనుభవం. గూగుల్‌ క్లౌడ్ ఇండస్ట్రీ సర్టిఫికేషన్. సేల్స్ స్కిల్స్, మెథడాలజీల పరిజ్ఞానం. క్లౌడ్‌ టెక్నాలజీలో న్యూ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, మెథడాలజీ, సోల్యూషన్‌ పరిజ్ఞానం, తదితర నైపుణ్యాలు ఉండాలి.

ఇతర అర్హతలు..

➥ గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.

➥ సేల్స్ స్కిల్స్, మెథడాలజీస్ నాలెడ్జ్ ఉండాలి.

➥  క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించి అభ్యసన, అవగాహన, కొత్త టెక్నాలజీలతో పనిచేసే సామర్థ్యం కలిగి ఉండాలి. 

➥ మంచి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్, రిటన్/వెర్బల్ కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా.

Data Scientist - Notification & Online Application

Cloud Sales Resident - Notification & Online Application

ALSO READ:

ఈసీఐఎల్‌లో 81 ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే!
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఈసీఐఎల్‌ ప్రాజెక్టు పనుల్లో వివిధ ఖాళీల భర్తీకి వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 81 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, టెక్నీషియన్, ట్రైనీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 23న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్‌ 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టుల ఆధారంగా రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

Continues below advertisement
Sponsored Links by Taboola