కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాంట్రాక్ట్/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన థియేటర్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి 10వ తరగతి, డిప్లొమా, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జులై 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక విధానం ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 07


1) థియేటర్ అసిస్టెంట్: 01


అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. డిప్లొమా(మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ & ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) కోర్సు చేసి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో సభ్యత్వం ఉండాలి.


2) మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 04 


అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.


3) ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 02


అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. గరిష్టంగా 52 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో ఇందులో 75 మార్కులు క్వాలిఫైయింగ్ పరీక్షలో వచ్చిన మార్కులకు, 15 మార్కులు అనుభవానికి, 10 మార్కులు నిబంధనల మేరకు ఇతర అర్హతలకు కేటాయిస్తారు.


జీతం: నెలకు రూ.15,000.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Superintendent Office,
Government General Hospital,
Kakinada, Kakinada District


ముఖ్యమైనతేదీలు..


ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.07.2023. 


ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.07.2023.


Notification & Application
Website


ALSO READ:


ఎయిమ్స్‌ రాయ్‌బరేలీలో 111 టెక్నీషియన్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు, అర్హతలివే!
రాయ్‌బరేలీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ టెక్నీషియన్స్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్‌ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఎన్‌ఐఓహెచ్‌ అహ్మదాబాద్‌లో 54 టెక్నికల్ పోస్టులు, వివరాలు ఇలా!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్‌, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!
మధ్యప్రదేశ్‌ బాలాఘట్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial