గుంటూరులోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గుంటూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 7వ తరగతి, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 94


* పారామెడికల్ పోస్టులు


➥ ల్యాబ్ టెక్నీషియన్- 04    


➥ అనస్థీషియా టెక్నీషియన్- 02


➥ బయోమెడికల్ టెక్నీషియన్- 01


➥ సీటీ టెక్నీషియన్- 02


➥ ఈసీజీ టెక్నీషియన్- 01


➥ ఎలక్ట్రీషియన్ - 03


➥ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్/ మెడికల్ ఫిజిసిస్ట్- 01


➥ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్- 01


➥ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్- 02


➥ రేడియోగ్రాఫర్ - 02


➥ రేడియోథెరపీ టెక్నీషియన్- 06


➥ ఈఎమ్‌టీ టెక్నీషియన్ సీఎం కాన్వాయ్- 01


➥ ఆఫీస్ సబార్డినేట్‌లు/అటెండర్లు- 07


➥ జనరల్ డ్యూటీ అటెండర్లు- 31


➥ స్టోర్ కీపర్- 01


➥ మౌల్డ్ టెక్నీషియన్(సీనియర్)- 01


➥ మౌల్డ్ టెక్నీషియన్(జూనియర్)- 01


➥ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 01


➥ పర్సనల్ అసిస్టెంట్- 01


➥ జూనియర్ అసిస్టెంట్/ కంప్యూటర్ అసిస్టెంట్- 04


➥ డీఈఓ/కంప్యూటర్ ఆపరేటర్- 03


➥ రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్- 01


➥ అసిస్టెంట్ లైబ్రేరియన్ - 01


➥ హౌస్‌కీపర్స్/వార్డెన్స్- 02


➥ క్లాసు రూం అటెండంట్స్- 01


➥ డ్రైవర్స్ హెవీ వెహికల్- 04


➥ డ్రైవర్స్( సీఎం కాన్వాయ్)- 01


➥ ఆయా- 01


➥ ల్యాబ్ అటెండంట్స్- 01


➥ లైబ్రరీ అటెండంట్స్- 01


➥ఓటీ అసిస్టెంట్- 04


➥ప్లంబర్- 01


ఖాళీలున్న వైద్య సంస్థలు: గుంటూరులోని జీఎంసీ, జీజీహెచ్‌, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్.


అర్హత: పోస్టును అనుసరించి 7వ తరగతి, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఆర్మీ సర్వీసుతో పాటు మరో 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు ఫీజు: ఓసీ & బీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, వెయిటేజీ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


చిరునామా:  The Principal Office , Government Medical College, Guntur.


ముఖ్యమైన తేదీలు..


⏩ దరఖాస్తుకు చివరి తేదీ: 30.12.2023.


⏩ ఫైనల్ మెరిట్‌లిస్ట్ వెల్లడి: 24.01.2024.


⏩ ఎంపిక జాబితా వెల్లడి: 29.01.2024.


⏩ కౌన్సెలింగ్ & పోస్టింగ్ తేదీ: 06.02.2024 


Notification


Website


ALSO READ:


➥ ఐడీబీఐ ఉద్యోగాల రాతపరీక్ష అడ్మిట్‌‌కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?


➥ ఎస్‌బీఐ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష షెడ్యూలు విడుదల, ఎప్పుడంటే?


ఏపీలో 99 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా


ఏపీలో 38 డీఈవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ, జీతమెంతో తెలుసా?


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...