న్యూఢిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 277 ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 4న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభకాగా.. జనవరి 20తో దరఖాస్తు గడువు ముగియనుంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 277
పోస్టుల కేటాయింపు: జనరల్ - 130, ఈడబ్ల్యూఎస్ - 24, ఓబీసీ - 64, ఎస్సీ - 43, ఎస్టీ - 16.
1) చీఫ్ ఇంజినీర్ (రెన్యూవబుల్ ఎనర్జీ): 05 పోస్టులు
2) సీనియర్ ఇంజినీర్ (రెన్యూవబుల్ ఎనర్జీ): 15 పోస్టులు
3) సీనియర్ ఇంజినీర్ (కెమికల్): 13 పోస్టులు
4) సీనియర్ ఇంజినీర్ (మెకానికల్): 53 పోస్టులు
5) సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 28 పోస్టులు
6) సీనియర్ ఇంజినీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 14 పోస్టులు
7) సీనియర్ ఇంజినీర్ (గెయిల్‌టెల్-TC/TM): 03 పోస్టులు
8) సీనియర్ ఇంజినీర్ (మెటలర్జీ): 05 పోస్టులు
9) సీనియర్ ఆఫీసర్ (ఫైర్ & సేఫ్టీ): 25 పోస్టులు
10) సీనియర్ ఆఫీసర్ (సీ & పీ): 32 పోస్టులు
11) సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్): 23 పోస్టులు
12) సీనియర్ ఆఫీసర్ (ఫైనాన్స్ & అకౌంట్స్): 23 పోస్టులు
13) సీనియర్ ఆఫీసర్ (హెచ్‌ఆర్): 24 పోస్టులు
14) ఆఫీసర్ (సెక్యూరిటీ): 14 పోస్టులు
అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్/ బీఈ/ బీటెక్/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ మాస్టర్స్ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
వయోపరిమితి: 28 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
పని అనుభవం: పోస్టులను బట్టి కనీసం 1-12 సంవత్సరాల అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.01.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.02.2023.
Also Read:
ఎయిమ్స్‌లో 88 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు, వివరాలు ఇలా!
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ డీఎన్‌బీ/ ఎంఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మెయిల్ ద్వారా జనవరి 14, స్పీడ్ పోస్టు ద్వార 19వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..