Rohit Sharma Virat Kohli: ప్రస్తుతం భారత జట్టు హార్దిక్ పాండ్యా నాయకత్వంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడుతోంది. ఇందులో టీమిండియా తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. హార్దిక్ సారథ్యంలోని భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు కనిపించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా టీమిండియా గత కొద్ది కాలంగా మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. యువ ఆటగాళ్ల ప్రదర్శన కారణంగా టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పునరాగమనం అసాధ్యమనే అనిపిస్తోంది.


న్యూజిలాండ్‌తో టీ20లో కూడా కష్టమే
శ్రీలంక సిరీస్ తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 18వ తేదీన న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా ఆ తర్వాత జనవరి 27వ తేదీ నుంచి టీ20 సిరీస్ జరగనుంది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టులో చేర్చే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఇద్దరు ఆటగాళ్ల టీ20 కెరీర్ ఇప్పుడు చివరి దశలో ఉంది. టీ20 జట్టు భవిష్యత్తు ప్రణాళికలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెట్ కావట్లేదు.


టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే...
టీ20 ఇంటర్నేషనల్‌లో హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శ్రీలంక సిరీస్ మాదిరిగానే న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనూ హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా కొనసాగించాలని భావిస్తున్నారు. బీసీసీఐ ఇప్పటికే కెప్టెన్సీని విభజించాలని చూస్తోంది.


విశేషమేమిటంటే హార్దిక్ పాండ్యా టీ20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టు కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. హార్దిక్ తన కెప్టెన్సీలో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను మొదట గెలుచుకున్నాడు. దీని తరువాత అతను వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌లో జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్‌లో కూడా భారత్ విజయం సాధించగలిగింది. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతని కెప్టెన్సీలో  టీమ్ ఇండియా 1-0తో సిరీస్‌ని గెలుచుకుంది. ఇప్పుడు శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ భారత జట్టు విజయం సాధించింది.