GAIL (India) Limited Non- Executive Posts Notification: ప్రభుత్వరంగ సంస్థ 'గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL Ltd)' దేశవ్యాప్తంగా ఉన్న గెయిల్‌ వర్క్ సెంటర్లు/యూనిట్లలో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా  పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి పదోతరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్‌, బీబీఎం, బీఈ, బీటెక్‌, ఎమ్మె్స్సీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.


ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సరైన అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 7 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.50 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.  రాతపరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్‌ టెస్ట్‌ (PET) ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.35,000 - రూ.1,38,000; జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,000 - రూ.1,20,000. మిగిలిన పోస్టులకు రూ.24,500 - రూ.90,000 జీతంగా ఇస్తారు.


వివరాలు..


* నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 391.


పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్‌)-174, ఈడబ్ల్యూఎస్‌-29, ఓబీసీ-89, ఎస్సీ-60 ఎస్టీ-39.


➥ జూనియర్ ఇంజినీర్ (కెమికల్): 02 పోస్టులు 


➥ జూనియర్ ఇంజినీర్ (మెకానికల్): 01 పోస్టు 


➥ ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు 


➥ ఫోర్‌మ్యాన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 14 పోస్టులు


➥ ఫోర్‌మ్యాన్ (సివిల్): 06 పోస్టులు 


➥ జూనియర్ సూపరింటెండెంట్ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌): 05 పోస్టులు 


➥ జూనియర్ కెమిస్ట్: 08 పోస్టులు


➥ జూనియర్ అకౌంటెంట్: 14 పోస్టులు 


➥ టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ): 03 పోస్టులు


➥ ఆపరేటర్ (కెమికల్): 73 పోస్టులు


➥ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 44 పోస్టులు


➥ టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 45 పోస్టులు


➥ టెక్నీషియన్ (మెకానికల్): 39 పోస్టులు 


➥ టెక్నీషియన్ (టెలికాం & టెలిమెట్రీ): 11 పోస్టులు 


➥ ఆపరేటర్ (ఫైర్): 39 పోస్టులు


➥ ఆపరేటర్ (బాయిలర్): 08 పోస్టులు


➥ అకౌంట్స్ అసిస్టెంట్: 13 పోస్టులు 


➥ బిజినెస్ అసిస్టెంట్: 65 పోస్టులు


అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్‌, బీబీఎం, బీఈ, బీటెక్‌, ఎమ్మె్స్సీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.50 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్‌ టెస్ట్‌ (PET) ఆధారంగా ఎంపికచేస్తారు. 


జీతభత్యాలు: జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.35,000 - రూ.1,38,000; జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,000 - రూ.1,20,000. మిగిలిన పోస్టులకు రూ.24,500 - రూ.90,000 జీతంగా ఇస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభం: 08.08.2024. 


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుకు చివరితేదీ: 07.09.2024. 06:00 PM


Notification


Online Application


Website