AP Forest Jobs: ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో 689 పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి ఈ మేరకు ఫిబ్రవరి 6న అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ప్రభుత్వం అనుమతి తెలిపిన ఖాళీల్లో హోంశాఖలో 7 జిల్లా సైనిక సంక్షేమాధికారుల పోస్టులను భర్తీచేసేందుకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. రక్షణశాఖ నుంచి పదవీవిరమణ చేసిన అధికారులతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 60 శాతం జీతం, ఇతర భత్యాలను కేంద్ర రక్షణశాఖ భరించనుంది. 


వివరాలు..


* ఖాళీల సంఖ్య: 689


ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్: 37 పోస్టులు


➥ ఫారెస్ట్ సెక్షన్‌ ఆఫీసర్: 70 పోస్టులు


➥ అటవీ బీట్‌ అధికారులు: 175 పోస్టులు


➥ అసిస్టెంట్ బీట్‌ అధికారులు: 375 పోస్టులు


➥ తనహదార్‌: 10 పోస్టులు


➥ డ్రాఫ్ట్స్‌మన్‌ గ్రేడ్‌-2: 12 పోస్టులు


➥ జూనియర్‌ అసిస్టెంటు: 10 పోస్టులు


గ్రూపు-4 ప్రొవిజనల్ జాబితా వెల్లడి..
గ్రూపు-4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్‌ జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 6 ఉద్యోగాలకుగాను నలుగురిని ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ఎంపిచేసింది. 


గ్రూప్-4 ఫలితాల కోసం క్లిక్ చేయండి..