FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్ III,  ఇతరుల దరఖాస్తుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అయితే ఎఫ్సీఐ 2022 రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతం వివరాలు మరియు దరఖాస్తు రుసుము వంటి  అన్ని వివరాల గురించి తెలుసుకోండి.

ముఖ్యమైన తేదీలు..

  • సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 05 అక్టోబర్ 2022
  • పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 05 అక్టోబర్ 2022

ఖాళీ వివరాలు..

  • జూనియర్ ఇంజినీర్ సివిల్: 48
  • జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ / మెకానికల్: 15
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II: 73
  • అసిస్టెంట్ గ్రేడ్ III జనరల్: 948
  • అసిస్టెంట్ గ్రేడ్ III ఖాతాలు: 406
  • అసిస్టెంట్ గ్రేడ్ III టెక్నికల్: 1406
  • అసిస్టెంట్ గ్రేడ్ III డిపో: 2054
  • అసిస్టెంట్ గ్రేడ్ III హిందీ: 93

అర్హతలు..

  • జూనియర్ ఇంజినీర్ సివిల్.. సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు 1 సంవత్సరం అనుభవం ఉండాలి. 
  • జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ / మెకానికల్.. ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II.. స్పీడ్ 40 డబ్ల్యూపీఎం మరియు ఇంగ్లీష్ టైపింగ్ 80 డబ్ల్యూపీఎం మరియు షార్ట్‌హ్యాండ్‌తో ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
  • అసిస్టెంట్ గ్రేడ్ III జనరల్.. కంప్యూటర్‌లో ప్రావీణ్యతతో పాటు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కల్గి ఉండాలి. 
  • అసిస్టెంట్ గ్రేడ్ III ఖాతాలు.. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ బి. కామ్‌తో పాటు కంప్యూటర్‌లో ప్రావీణ్యత కల్గి ఉండాలి. 
  • అసిస్టెంట్ గ్రేడ్ III టెక్నికల్.. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్. B.SC అగ్రికల్చర్ / బోటనీ / జువాలజీ / బయో టెక్నాలజీ / బయో కెమిస్ట్రీ / మైక్రోబయాలజీ / ఫుడ్ సైన్స్ లేదా ఫుడ్ సైన్స్ / ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ / అగ్రికల్చర్ ఇంజనీరింగ్ / బయో టెక్నాలజీలో BE / B.Tech లో ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్‌ వినియోగంలో ప్రావీణ్యత కల్గి ఉండాలి. 
  • అసిస్టెంట్ గ్రేడ్ III డిపో.. కంప్యూటర్‌ వినియోగంలో ప్రావీణ్యతతో పాటు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కల్గి ఉండాలి.
  • అసిస్టెంట్ గ్రేడ్ III హిందీ.. హిందీని ప్రధాన సబ్జెక్ట్‌గా కలిగి ఉన్న బ్యాచిలర్ డిగ్రీ మరియు ఇంగ్లీషు నుండి హిందీ అనువాదం చేయగలగాలి.