ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ గ్రేడ్-3 పరీక్ష అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న  అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2023, జనవరి 1, 7,14, 21, 29 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు (పాన్‌కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..) వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్‌కార్డులో అభ్యర్థుల వివరాల్లో ఏమైనా సందేహాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా.. 


Step 1: అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. -https://fci.gov.in


Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే "Career" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. 


Step 3: అక్కడ "Assistant Grade 3 Admit Card 2019" లింక్ మీద క్లిక్ చేయాలి.


Step 4: లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి. 


Step 5: వివరాలు నమోదుచేసి "Submit" బటన్ మీద క్లిక్ చేయాలి.


Step 6: అభ్యర్థుల అడ్మిట్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 


అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని పరీక్ష రోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేనిదే  పరీక్ష రాసేందుకు అనుమతిలేదు.


ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 5043 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. తాజాగా పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. 


పోస్టుల వివరాలు..


* కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్: 5043 పోస్టులు


జోన్ల వారీగా ఖాళీలు: నార్త్ జోన్-2388, సౌత్ జోన్-989, ఈస్ట్ జోన్-768, వెస్ట్ జోన్-713, నార్త్‌ఈస్ట్‌జోన్-185.


1. జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్):  48 పోస్టులు


2. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్): 15 పోస్టులు


3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 73 పోస్టులు


4. అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్):  948 పోస్టులు 


5. అసిస్టెంట్ గ్రేడ్-3(అకౌంట్స్):  406 పోస్టులు


6. అసిస్టెంట్ గ్రేడ్-3(టెక్నికల్):  1406 పోస్టులు


7. అసిస్టెంట్ గ్రేడ్-3(డిపో):  2054 పోస్టులు


8. అసిస్టెంట్ గ్రేడ్-3(హిందీ):  93 పోస్టులు


జీతం: 


➥ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు రూ.34,000 - రూ.1,03,400. ఇతర భత్యాలు అదనం.


➥ స్టెనోగ్రాఫర్ పోస్టులకు రూ.30,500 - రూ.88,100. ఇతర భత్యాలు అదనం.


➥ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు రూ.28,200 - రూ.79,100. ఇతర భత్యాలు అదనం.


పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


Also Read:


కానిస్టేబుల్ పోస్టుల 'అప్లికేషన్ స్టేటస్' వచ్చేసింది! చెక్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!
సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయ్ పోస్టుల భర్తీకి సంబంధించిన 'అప్లికేషన్ స్టేటస్' లింక్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాక్టివేట్ చేసింది. అయితే ప్రస్తుతానికి సౌత్ రీజియన్‌, కర్ణాటక-కేరళ రీజియన్లకు సంబంధించిన లింక్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. త్వరలోనే రీజియన్ల వారీగా అన్ని రీజినల్ వెబ్‌సైట్లలో పెట్టనుంది. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ స్టేటస్ వివరాలు తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.. 


'కేంద్రీయ' ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు చివరితేదీని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 26తో దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే దరఖాస్తు గడువును 2023, జనవరి 2 వరకు పొడిగిస్తూ కేవీఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చివరితేది మాత్రమే మారిందని.. అభ్యర్థుల అర్హతలు, వయోపరిమితి, అనుభవం తదితర వివరాల్లో ఎలాంటి మార్పులు జరగలేదని కేవీఎస్ తెలిపింది.
పోస్టుల పూర్తివివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...