Walk in interview: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్, కేరళ ఒప్పంద ప్రాతిపదికన సూపర్‌ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. దీనిద్వారా 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యు యేట్‌ డిగ్రీ, డీఎన్‌బీ, డిప్లొమా, ఎంబీబీఎస్‌లో టీసీఎమ్‌సీ రిజిస్ట్రేషన్‌ ఉండాలి. దాంతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హలు. సరైన అర్హతలున్నవారు మార్చి 4వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత చిరునామాలో ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలి. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 22


⏩ సూపర్‌ స్పెషలిస్ట్ (పార్ట్‌ టైం, ఫుల్ టైం): 03 పోస్టులు


➥ ఎండోక్రైనాలజీ: 01 పోస్టు


➥ కార్డియాలజీ: 01 పోస్టు


➥ న్యూరాల‌జీ: 01 పోస్టు


ఫుల్ టైం సూపర్ స్పెషలిస్ట్: పని గంటలు- వారం రోజులలో ఉదయం 09.00 నుంచి మధ్యహ్నం 04.00, శనివారం రోజు 09.00 నుంచి మధ్యహ్నం 01.00 వరకు. అత్యవసర కాల్‌కు అవసరమైనప్పుడు హాజరు కావాలి.


వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 69 సంవత్సరాలు మించకూడదు.


వేతనం: రూ. 2,00,000.


పార్ట్‌ టైం సూపర్ స్పెషలిస్ట్: పని గంటలు- రోజుకు 4 గంటల సెషన్ x వారంలో నాలుగు రోజులు(16 గంటలు). 


వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 69 సంవత్సరాలు మించకూడదు.


వేతనం: నెలకు రూ.1,00000. అదనపు డ్యూటీకి రూ.20,000.


కన్సల్టెంట్(సీనియర్ లెవెల్) – నెలకు రూ.1,50,000. +20,000.


⏩ స్పెషలిస్ట్(పార్ట్‌ టైం, ఫుల్ టైం): 07 పోస్టులు


➥ ప‌ల్మనాల‌జీ: 02


➥ జనరల్ మెడిసిన్: 01


➥ మైక్రోబయాలజీ: 01


➥ ఆఫ్తమాలజీ: 01


➥ డెర్మటాలజీ: 01


➥ పీడియాట్రిక్స్: 01


పార్ట్‌ టైం సూపర్ స్పెషలిస్ట్: పని గంటలు- వారం రోజులలో ఉదయం 09.00 నుంచి మధ్యహ్నం 04.00, శనివారం రోజు 09.00 నుంచి మధ్యహ్నం 01.00 వరకు. అత్యవసర కాల్‌కు అవసరమైనప్పుడు హాజరు కావాలి.


వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 69 సంవత్సరాలు మించకూడదు.


వేతనం: జూనియర్ స్పెషలిస్ట్ లెవెల్ 11 కోసం రూ.1,36,052., సీనియర్ స్పెషలిస్ట్ లెవెల్ 12 కోసం రూ.1,52,242.


పార్ట్‌ టైం సూపర్ స్పెషలిస్ట్: పని గంటలు- రోజుకు 4 గంటల సెషన్ x వారంలో నాలుగు రోజులు(16 గంటలు). 


వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 69 సంవత్సరాలు మించకూడదు.


వేతనం: నెలకు రూ.60,000. అదనపు డ్యూటీకి రూ.15,000.


⏩ సీనియర్‌ రెసిడెంట్‌:  08 పోస్టులు


➥ అనస్థీషియాలజీ: 01


➥ జనరల్ మెడిసిన్: 02


➥ జనరల్ సర్జరీ: 02


➥ గైనకాలజీ: 01


➥ ఆర్థోపెడిక్స్: 01


➥ ప‌ల్మనాల‌జీ: 01


వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ &ఓబీసీలకు వయో సడలింపు వర్తిస్తుంది.


వేతనం: రూ.1,36,052. 


⏩ సీనియర్‌ రెసిడెంట్స్‌: 04 పోస్టులు


➥ ఎమ్ఐసీయూ: 04 పోస్టులు


వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ &ఓబీసీలకు వయో సడలింపు వర్తిస్తుంది.


వేతనం: రూ.1,36,052. 


అర్హత:  పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యు యేట్‌ డిగ్రీ, డీఎన్‌బీ, డిప్లొమా, ఎంబీబీఎస్‌లో టీసీఎమ్‌సీ రిజిస్ట్రేషన్‌ ఉండాలి. దాంతో పాటు పని అనుభవం ఉండాలి.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి. మహిళా, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక విధానం: అర్హత, అనుభవం & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వేదిక: ESIC Model and Super Speciality Hospital Asramam, Kollam (Kerala).


వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 04.03.2024.


రిపోర్టింగ్ సమయం: ఉదయం 09.00 గంటలకు, కాన్ఫరెన్స్ హాల్.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...