హైదరాబాద్‌‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 40 సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు పోస్టుని అనుసరించి ఏప్రిల్ 25 నుంచి 28 వరకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 40


పోస్టుల వారీగా ఖాళీలు..


1. సీనియర్ రెసిడెంట్: 29


⦁ అనస్థీషియా: 03


⦁ రేడియాలజీ: 07


⦁ కార్డియాలజీ: 03


⦁ పీడియాట్రిక్ సర్జరీ: 03


⦁ యూరాలజీ: 01


⦁ న్యూరో సర్జరీ: 01


⦁ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్: 01


⦁ నెఫ్రాలజీ: 02


⦁ న్యూరాలజీ: 05


⦁ సీటీవీఎస్(CTVS): 03


2. సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవెల్)/ సీనియర్ కన్సల్టెంట్: 05


⦁ కార్డియాలజీ: 01


⦁ సీటీవీఎస్(CTVS): 01


⦁ న్యూరాలజీ: 01


⦁ పీడియాట్రిక్ సర్జరీ: 02


3. సూపర్ స్పెషలిస్ట్(ఎంట్రీ లెవెల్)/ జూనియర్ కన్సల్టెంట్: 03


⦁ కార్డియాలజీ: 01


⦁ నెఫ్రాలజీ: 01


⦁ న్యూరో సర్జరీ: 01


4. స్పెషలిస్ట్: 03


⦁ అనస్థీషియా: 01


⦁ రేడియాలజీ: 02


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.


వయోపరిమితి: 45-69 సంవత్సరాల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.67700-రూ.2.4లక్షలు చెల్లిస్తారు.


ఇంటర్వ్యూ వేదిక: Chamber of Medical Superintendent, ESIC Super Speciality Hospital, Sanathnagar, Hyderabad.


ఇంటర్వ్యూ తేదిలు: 25.04.2023 నుంచి 28.04.2023 వరకు నిర్వహిస్తారు.



Notification 


Website


Also Read:


అణుశక్తి విభాగంలో 65 జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ముంబయితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్‌ యూనిట్లలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 22 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు మే 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


CIPET: సీపెట్‌లో 38 సూపర్‌వైజరీ & నాన్-సూపర్‌వైజరీ పోస్టులు
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ దేశవ్యాప్తంగా సీపెట్‌ కేంద్రాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 38 సూపర్‌వైజరీ, నాన్-సూపర్‌వైజరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 29 వరకు ఆఫ్‌లైన్ విధానంలో సంబంధిత చిరునామాకు దరఖాస్తులు పంపాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...