ఫరీదాబాద్‌‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 55 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 24న నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

వివరాలు..

 మొత్తం ఖాళీలు: 55.

* సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు

విభాగాలు: అనాటమీ, అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, బ్లడ్ బ్యాంక్, డెర్మటాలజీ, ఎమర్జెన్సి మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఐ.సి.యు, మైక్రోబయాలజీ, NICU, OBG, ఆప్తమాలజీ, ఒటోరినోలారిన్జాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, PMR, సైకియాట్రి, పల్మనరీ మెడిసిన్, రేడియో డయాగ్నోసిస్, క్యాజువాలిటి, యూరాలజీ, ఆంకాలజీ.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోసరిమితి: 45 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ.67700-రూ.127141 చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ తేది: 24.02.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి ప్రారంభం.

ఇంటర్వ్యూ వేదిక: ESIC Medical College &Hospital, NH-3, NIT, Faridabad.

Notification Application Form Website 

Also Read:

మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..  

CMAT: కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!దేశ‌వ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల‌కు నిర్వహించే కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ (సీమ్యాట్)-2023 ప్రక‌ట‌న‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాల నమోదుకు అవకాశం!ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 19న  ప్రిలిమిన‌రీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటలకు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పేపర్-1, పేపర్-2 పరీక్షల ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్‌ఐ ప్రిలిమినరీ ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం పోలీసు నియామక బోర్డు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాల నమోదుచేసుకునే వెసులుబాటు ఉంది. నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా తెలపాల్సి ఉంటుంది. మరే ఇతర విధానాల్లోనూ అభ్యంతరాలను స్వీకరించబోరు.ఎస్ఐ రాతపరీక్ష ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..