EDCIL Recruitment: నోయిడాలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన శ్రీలంకలోని పాఠశాలల్లో టీచర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, బీఈడీ, పని అనుభవంతో పాటు తమిళం/ఆంగ్ల భాషల్లో బోధనా ప్రావీణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది


వివరాలు..


ఖాళీల సంఖ్య: 50.


⏩ టీజీటీ టీచర్స్ ట్రైనీ


⏩ పీజీటీ టీచర్స్ ట్రైనీ


సబ్జెక్టులు: ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ.


లోకేషన్స్:


➥ కాండీ అండ్ మాతలే


➥ నువారే ఎలియా


➥ రత్నపురా మరియు కేగల్లె


➥ బాదుల్లా


అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, బీఈడీ, పని అనుభవంతో పాటు తమిళం/ ఆంగ్ల భాషల్లో బోధనా ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి.


వయోపరిమితి: 5.03.2024 నాటికి 65 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతం: నెలకు రూ.1,25,000.


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20.04.2024.


దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయవలిసిన సర్టిఫికేట్‌లు..


➥ పర్సనల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిపికేషన్ డిటేయిల్స్: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ మార్క్‌షీట్‌లు అండ్ ఏదైనా ఇతర అర్హత సర్టిఫికేట్‌లు.


➥ వర్క్ ఎక్సిపీరియన్స్‌తో పాటు సంస్థ యొక్క లెటర్ హెడ్‌లో చేరిన తేదీ మరియు రిలీవింగ్ తేదీని స్పష్టంగా పేర్కొన్న సర్టిఫికేట్‌,  ప్రస్తుతం వర్కింగ్ ఆర్గనైజేషన్ విషయంలో, అభ్యర్థులు గత 3 నెలల పే స్లిప్‌తో పాటు జాయినింగ్ లెటర్‌ను తీసుకురావాలి.


➥ ID-ప్రూఫ్‌గా ఓటర్-ID/ఆధార్/పాన్ కార్డ్ ఉండాలి.


➥ కనీసం 6 నెలల చెల్లుబాటుతో పాస్‌పోర్ట్ (శ్రీలంకకు వెళ్లడానికి చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ తప్పనిసరి.)


➥ అప్‌డేట్ చేసిన రెజ్యూమ్.


➥ సర్టిఫికెట్ల పరిమాణం కనీసం 100 kb మరియు గరిష్టంగా 500 kb ఉండాలి మరియు ఫార్మాట్ pdf/jpg/jpeg onl ఉండాలి.


➥ రీసెంట్ ఫోటో యొక్క స్కాన్ చేసిన కాపీ (jpg/jpeg ఫార్మాట్‌లో)


➥ బ్లాక్ పెన్‌తో సంతకం చేసి స్కాన్ చేసిన కాపీ (jpg/jpeg ఫార్మాట్‌లో)


➥ ఇమేజ్‌ల పరిమాణం కనిష్టంగా 50 kb మరియు గరిష్టంగా 80 kb ఉండాలి.


Notification


Online Application


Website


ALSO READ: 


రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో 4,660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
RPF Notification: దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్ల పరిధిలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శ్రీకారంచుట్టింది. దీనిద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) విభాగాల్లో మొత్తం 4,660 ఖాళీలను భర్తీచేయనున్నారు. వీటిలో సబ్-‌ఇన్‌స్పెక్టర్(RPF SI) - 452 పోస్టులు, కానిస్టేబుల్ (RPF Constable) - 4208 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన సంక్షిప్త ప్రకటనను రైల్వేశాఖ(RRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌ 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు మే 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...