Copying In Group 1 Prelims Exam in Ongole: ఏపీలో ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓ అభ్యర్థి మొబైల్ తో కాపీయింగ్ కు పాల్పడుతూ అధికారులకు చిక్కాడు. ఒంగోలులోని (Ongole) స్థానిక వెంగముక్కపాలెం రోడ్డులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ అభ్యర్థి మొబైల్ సాయంతో కాపీయింగ్ చేస్తుండగా ఇన్విజిలేటర్ గమనించి పట్టుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద ముమ్మర తనిఖీలు చేసినప్పటికీ సిబ్బంది కళ్లుగప్పి సెల్ ఫోన్ ను లోపలికి తీసుకెళ్లాడు. బయటి వ్యక్తులకు ఫోన్ చేసి సమాధానాలు తెలుసుకుని రాస్తుండగా.. ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సదరు అభ్యర్థిని పోలీసులు విచారిస్తున్నారు. అటు, రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్షా కేంద్రాల్లో 1,48,881 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పేపర్ - 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పేపర్ - 2 పరీక్ష నిర్వహించారు.


Also Read: Palnadu News: కోటప్పకొండకు వెళ్తుండగా బస్సు బోల్తా - 40 మందికి తీవ్ర గాయాలు, పల్నాడు జిల్లాలో ఘటన