ECIL Recruitment News | మీరు ITI ఉత్తీర్ణులై, ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త వచ్చింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) కొన్ని పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ECIL అధికారిక వెబ్‌సైట్ ecil.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించారు. సీనియర్ ఆర్టిసన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 7, 2025 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి..
- సీనియర్ ఆర్టిసన్-సి (Cat-1): మొత్తం 120 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 50 పోస్టులు
- ఎలక్ట్రీషియన్ – 30 పోస్టులు
- ఫిట్టర్ – 40 పోస్టులు
- సీనియర్ ఆర్టిసన్-సి (Cat-2): మొత్తం 5 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 1 పోస్టు
- ఎలక్ట్రీషియన్ – 2 పోస్టులు
- ఫిట్టర్ – 2 పోస్టులు
అభ్యర్థుల అర్హత ఏమిటి.. ఈసీఐఎల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో ITI చదివి సర్టిఫికేట్ ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో పని చేసిన అనుభవం ఉంటే అర్హత లభిస్తుంది. వయోపరిమితి (Age Limit) విషయానికి వస్తే, సాధారణ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 ఏళ్లు ఉండాలి. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.జీతం ఎంత వరకు.. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ECIL నెలకు రూ. 23,368 జీతం చెల్లిస్తుంది. ఈ వేతన శ్రేణి ఉద్యోగ భద్రత, ప్రభుత్వ సౌకర్యాలతో మంచి ప్యాకేజీగా చెప్పవచ్చు. ఎలా ఎంపిక చేస్తారు.. ITIలో వచ్చిన మార్కుల ఆధారంగా, దరఖాస్తుదారులను 1:4 నిష్పత్తిలో మొదట షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి ITIలో ఒకే మార్కులు వస్తే, 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎప్పుడు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 7, 2025లోపు ECIL అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంది, కనుక ఆఫ్‌లైన్ విధానంలో చేసినట్లు కాదు. కనుక ఎలాంటి తప్పులు జరగకుండా ఉండటానికి అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా ఫిల్ చేయాలి.