ECHS Recruitment: దనపుర్‌లోని ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్ఎస్) కాంట్రాక్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 37 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, బీఫార్మసీ, డిప్లొమా, జీఎన్‌ఎం, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 37
ఓఐసీ పాలిక్లినిక్: 02
మెడికల్ ఆఫీసర్: 08
గైనకాలజిస్ట్: 01
ఫార్మసిస్ట్: 01
డెంటల్ హైజీనిస్ట్/ అసిస్టెంట్/ టెక్నీషియన్: 01
నర్సింగ్ అసిస్టెంట్: 01
డ్రైవర్: 02
ఐటీ నెట్‌వర్క్ టెక్నీషియన్: 01
డేటా ఎంట్రీ ఆపరేటర్: 03
క్లర్క్: 17
అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, బీఫార్మసీ, డిప్లొమా, జీఎన్‌ఎం, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల మేరకు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.16800-రూ.1లక్ష చెల్లిస్తారు.
చిరునామా: OIC, HQ Cell(ECHS), HQ J&B Area, Danapur, Patna-801503.
ఇంటర్వ్యూ వేదిక: సైనిక్ ఇన్‌స్టిట్యూట్, కే/ఆఫ్ హెచ్‌క్యూ జే అండ్ బీ ఏరియా, దనపుర్, కంటోన్మెంట్, పట్నా-801503.
ముఖ్యమైన తేదీలు..
ఇంటర్వ్యూ తేది: 08, 09.11.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు.
దరఖాస్తుకు చివరి తేది: 18.10.2023.
ALSO READ:
ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు/ఆసుపత్రుల్లో 1038 పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రీజియన్‌లో మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్‌లో 48 ఖాళీలు
న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంస్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు కొనసాగనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
వ్యాప్‌కోస్ లిమిటెడ్‌లో 140 కంట్రోల్ ఇంజినీర్ ఖాళీలు, అర్హతలివే!
గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్ లిమిటెడ్ సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్, ఫీల్డ్ క్వాలిటీ అసూరెన్స్ అండ్ కంట్రోల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..