ECR Central Railway Apprentices Recruitment: బీహార్‌లోని పాట్నా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - ఈస్ట్ సెంట్రల్‌ రైల్వే(RRC ECR) పరిధిలోని డివిజన్‌/యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌ (ACT Apprentice) శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1,154 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


యూనిట్స్‌/ డివిజన్లు: దనపుర్‌ డివిజన్‌, ధన్‌బాద్‌ డివిజన్‌, పండిట్‌ దీన్‌దాయాల్‌ ఉపాద్యాయ డివిజన్‌, సోన్‌పుర్‌ డివిజన్‌, సమస్తిపుర్‌ డివిజన్‌, ప్లాంట్‌ డిపోట్, క్యారేజ్‌ రిపేర్‌ వర్క్‌షాప్‌/ హర్నాట్‌, మెకానికల్‌ వర్క్‌షాప్‌/ సమస్తిపుర్‌.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 1,154


* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు


యూనిట్స్‌/ డివిజన్‌ల వారీగా ఖాళీలు..


⏩ దానాపూర్ డివిజన్: 675


ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..


➥ ఫిట్టర్: 201 పోస్టులు


➥ వెల్డర్: 08 పోస్టులు


➥ మెకానిక్(డిజిల్‌): 37 పోస్టులు


➥ రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్‌: 75 పోస్టులు


➥ ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్: 24 పోస్టులు


➥ కార్పెంటర్: 09 పోస్టులు


➥ ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌: 142 పోస్టులు


➥ పెయింటర్ (జనరల్): 07 పోస్టులు


➥ ఎలక్ట్రీషియన్: 146 పోస్టులు


➥ వైర్‌మ్యాన్: 26 పోస్టులు


⏩ ధన్‌బాద్ డివిజన్: 156 పోస్టులు


ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..


➥ ఫిట్టర్: 41 పోస్టులు


➥ టర్నర్: 23 పోస్టులు


➥ మెషినిస్ట్: 07 పోస్టులు


➥ కార్పెంటర్: 04 పోస్టులు


➥ వెల్డర్ (జి&ఇ): 44 పోస్టులు


➥ మెకానిక్ డీజిల్(ఫిట్టర్): 15 పోస్టులు


➥ వైర్‌మ్యాన్: 22 పోస్టులు


⏩ Pt. దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్: 64 పోస్టులు


ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..


➥ ఫిట్టర్: 38 పోస్టులు


➥ వెల్డర్: 03 పోస్టులు


➥ ఎలక్ట్రీషియన్: 06 పోస్టులు


➥ టర్నర్: 01 పోస్టులు


➥ వైర్‌మ్యాన్: 01 పోస్టులు


➥ ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 11 పోస్టులు


➥ మెకానిక్ (డిజిల్‌): 04 పోస్టులు


⏩ సోన్‌పూర్ డివిజన్: 47 పోస్టులు


ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..


➥ ఫిట్టర్: 21 పోస్టులు


➥ కమ్మరి: 05 పోస్టులు


➥ వెల్డర్: 06 పోస్టులు


➥ కార్పెంటర్: 06 పోస్టులు


➥ పెయింటర్: 09 పోస్టులు


⏩ సమస్తిపూర్ డివిజన్: 46 పోస్టులు


ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..


➥ ఫిట్టర్: 10 పోస్టులు


➥ టర్నర్: 03 పోస్టులు


➥ మెకానికల్ (డిఎస్ఎల్): 10 పోస్టులు


➥ ఎలక్ట్రీషియన్: 10 పోస్టులు


➥ ఎలక్ట్రానిక్స్/మెకానికల్: 04 పోస్టులు


➥ వెల్డర్: 03 పోస్టులు


➥ పెయింటర్: 03 పోస్టులు


➥ కార్పెంటర్: 03 పోస్టులు


⏩ ప్లాంట్ డిపో/ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ: 29 పోస్టులు


ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..


➥ ఫిట్టర్: 22 పోస్టులు


➥ మెషినిస్ట్: 02 పోస్టులు


➥ వెల్డర్ (జి&ఇ): 01 పోస్టు


➥ ఎలక్ట్రీషియన్: 01 పోస్టు


➥ మెషినిస్ట్/గ్రైండర్: 01 పోస్టు


➥ టర్నర్: 01 పోస్టు


➥ మెకానికల్ (డిఎస్ఎల్): 01 పోస్టు


⏩ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్/ హర్నాట్: 110 పోస్టులు


ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..


➥ ఫిట్టర్: 74 పోస్టులు


➥ మెషినిస్ట్: 12 పోస్టులు


➥ వెల్డర్: 16 పోస్టులు


➥ ఎలక్ట్రీషియన్: 08 పోస్టులు


⏩ మెకానికల్ వర్క్‌షాప్/సమస్టిపూర్: 27 పోస్టులు


ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..


➥ ఫిట్టర్: 09 పోస్టులు


➥ వెల్డర్: 09 పోస్టులు


➥ మెషినిస్ట్: 06 పోస్టులు


➥ ఎలక్ట్రీషియన్: 03 పోస్టులు


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్యూలేషన్‌/పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీవీటీ జారీచేసిన నేషనల్‌ నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి


వయోపరిమితి: 01.01.2025 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-13 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.01.2025.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.02.2025.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..