కోల్కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ పశ్చిమ్ బెంగాల్ లేదా ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని వివిధ డీవీసీ ప్లాంట్లు మరియి స్టేషన్లలో ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా(ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 26 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఉంటుంది.


వివరాలు..


* జూనియర్ ఇంజినీర్ పోస్టులు


మొత్తం ఖాళీలు: 40.


1. మెకానికల్: 10


2. ఎలక్ట్రికల్: 10


3. సి అండ్‌ ఐ: 10


4. సివిల్: 05


5. కమ్యూనికేషన్: 05


అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా(ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


పే స్కేల్: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400.


ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.05.2023.


Notification 


Website 


Also Read:


BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 428 ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 428 ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


డిగ్రీ ప్రవేశాలకు 'దోస్త్‌' నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్‌ వెలువడింది. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి‌ కార్యాలయంలో గురువారం (మే 11) డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16 నుంచి జులై 10 వరకు దోస్త్ ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 
దోస్త్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..