Telangana Teacher Posts: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వడంతో ఏర్పడబోయే 15 వేల ఖాళీలను.. తాజా డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలపాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలపాలంటూ అభ్యర్థులు జూన్ 24న ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలు, స్టడీ సెంటర్ల వరద్ వద్ద ఆందోళనలు చేశారు. కొత్తగా టెట్ పాసైన వాళ్లు కూడా డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు వీలుగా జులైలో నిర్వహించే పరీక్షలను కనీసం 40 రోజులపాటు వాయిదా వేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


ఇక బదిలీల విషయానికొస్తే.. మల్టీజోన్‌-2లోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు మినహా 12 జిల్లాల్లో 6,013 మంది స్కూల్‌ అసిస్టెంట్లను సోమవారం (జూన్ 24న) విద్యాశాఖ అధికారులు బదిలీచేశారు. సంగారెడ్డి 834, జనగాం 335, యాద్రాద్రి 562, మేడ్చల్‌ 456, వికారాబాద్‌ 641, మహబూబ్‌నగర్‌ 397, జోగులాంబ గద్వాల 305, వనపర్తి 310, నాగర్‌కర్నూల్‌ 451, నల్గొండ 876, సూర్యాపేట 575, నారాయణపేట జిల్లాలో 271 స్కూల్‌ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు.


స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీల నేపథ్యంలో.. ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు తొలుత ప్రస్తుతం ఎస్‌ఏలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను బదిలీ చేయాలి. ఇందులో భాగంగానే సోమవారం (జూన్ 24) బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదే జోన్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో గతేడాదే బదిలీలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో మాత్రం కోర్టు కేసు కారణంగా నిలిచిపోయాయి.  మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లోని 1,015 మంది టీచర్లకు ఆదివారమే స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చారు. 


ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ ముగియడంతో మండల, జిల్లా పరిషత్తు పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఎస్జీటీలకు, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లోని భాషా పండితులు, పీఈటీలకు మూడు, నాలుగు రోజుల్లో ఎస్‌ఏలుగా పదోన్నతులు దక్కనున్నాయి. వారికి మంగళవారం (జూన్ 25న) వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. 


ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల (SA) బదిలీల ప్రక్రియ ముగియడంతో.. మండల, జిల్లా పరిషత్తు పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఎస్జీటీలకు, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లోని భాషా పండితులు, పీఈటీలకు మూడు, నాలుగు రోజుల్లో ఎస్‌ఏలుగా పదోన్నతులు దక్కనున్నాయి. వారికి మంగళవారం (జూన్ 25) వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లోని 1,015 మంది టీచర్లకు జూన్ 23న స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. ఇక హైదరాబాద్ జిల్లాలో గతేడాదే బదిలీలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో మాత్రం కోర్టు కేసు కారణంగా నిలిచిపోయాయి.


డీఎస్సీ పూర్తి షెడ్యూలు కోసం నిరీక్షణ..
తెలంగాణలో మెగా డీఎస్సీ దరఖాస్తు గడువు ముగిసి వారం కావస్తున్నా.. ఇప్పటివరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూలును విద్యాశాఖ విడుదల చేయలేదు. జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు జరుగనున్నాయి. అయితే ఇప్పటివరకు పేపర్లవారీగా పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించనేలేదు. దీంతో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ పరీక్షను నిర్వహిస్తారో.. ఏ పేపర్‌కు ఎంత సమయం పాటు ప్రిపర్‌కావాలనో తెలియక అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు లేని విధంగా.. తొలిసారిగా డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు ఉమ్మడి జిల్లాల ప్రాదిపదికన పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నారు.






మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...