Agnisakshi Web Series Streaming Date: స్టార్ మా ఛానల్ సీరియల్స్ (Star Maa Serials)లో 'అగ్నిసాక్షి'కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన సీరియల్ అది. అర్జున్ అంబటి (Ambati Arjun), ఐశ్వర్య పిస్సే జంటగా నటించారు. ఆ జోడీతో పాటు ఆ సీరియల్ సైతం సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఆ జంటతో ఆ పేరుతో సస్పెన్స్ డ్రామా వస్తోంది. కానీ, ఓ ట్విస్ట్ ఉంది. ఈసారి టీవీ కోసం కాదు... ఓటీటీ కోసం సరికొత్త 'అగ్నిసాక్షి'ని రెడీ చేస్తున్నారు.


అగ్నిసాక్షి... సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్!
''స్టార్ మా ప్రేక్షకుల మనస్సాక్షి... అగ్నిసాక్షి. అదే జంటతో... అదే పేరుతో... డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar)లో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్'' అంటూ ఈ రోజు 'అగ్నిసాక్షి' ప్రోమో విడుదల చేశారు. ''కొత్త జీవితం... కొత్త కథ'' అంటూ ప్రోమోకి ఎండ్ కార్డు వేశారు. దాంతో 'అగ్నిసాక్షి' సీరియల్, ఈ 'అగ్నిసాక్షి' కథకు సంబంధం లేదని చెప్పకనే చెప్పేశారు.


కొత్త కథతో రూపొందిన ఈ నయా సస్పెన్స్ థ్రిల్లర్ 'అగ్నిసాక్షి'లోనూ శంకర్ పాత్రలో అర్జున్ అంబటి కనిపించనున్నారు. ఆయన మాసీ రోల్ చేశారని ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది. 'అప్పుడప్పుడూ బీడీ విల్ ఫైర్' అంటూ ఆయన గన్ ఫైరింగ్ చేశారు. ఏకంగా పోలీసుల చేతుల్లోంచి తుపాకీలు లాక్కుని విశ్వంసం సృష్టించాడు శంకర్. మరి, ఆయన ఎవరు? ఆయన కథ ఏమిటి? అనేది తెలియాలంటే 'అగ్నిసాక్షి' సిరీస్ వచ్చేవరకు వెయిట్ చేయాలి.


పోలీస్ అధికారిగా ఐశ్వర్య పిస్సే!
Aishwarya Pisse Role In Agnisakshi: 'అగ్నిసాక్షి'లో ఐశ్వర్య పిస్సే పోలీస్ రోల్ చేశారు. ఓ దేవాలయంలో పూజ చేస్తున్నట్లుగా ఆవిడను పరిచయం చేశారు. ఆ తర్వాత 'ఓయ్! దందాలో నిజాయతీ ఉండాలి' అని ఒకరికి వార్నింగ్ ఇచ్చారు. 'నువ్వు ఎవరు చెప్పడానికి?' అని అతడు ప్రశ్నించగా... 'ఈ సర్కార్ నన్ను పోలీస్ అంటది. నా పేరు గౌరీ' అని సమాధానం ఇచ్చారు.


Also Readటాప్ విప్పేసిన అనసూయ... ముద్దులతో అయేషా... ఏడ్చిన అమర్ దీప్... ఏందిరా మీ రచ్చ!






జూలై 12 నుంచి 'అగ్నిసాక్షి' స్ట్రీమింగ్!
శంకర్, గౌరీ పాత్రల్లో అర్జున్ అంబటి, ఐశ్వర్య పిస్సే మరోసారి సందడి చేయనున్న ఈ 'అగ్నిసాక్షి'లో 'బ్రహ్మముడి' ఫేమ్ కిరణ్ కాంత్ ఓ రోల్ చేశారు. జూలై 12వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ / సీరియల్ స్ట్రీమింగ్ కానుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిసింది.


Also Read'జబర్దస్త్' ఫైమా ముగ్గరితో ట్రాక్ నడిపిందా? ప్రవీణ్ కంటే ముందు అతడితో...