ఫైమా... 'జబర్దస్త్' ఫైమా (Jabardasth Faima)గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు తెలుసు. తొలుత 'పటాస్', ఆ తర్వాత 'జబర్దస్త్', అక్కడి నుంచి 'శ్రీదేవి డ్రామా కంపెనీ' మీదుగా 'బిగ్ బాస్' వరకు వెళ్లి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మల్లెమాల సంస్థ చేసే షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో సందడి చేస్తోంది. ఈ అమ్మాయి ఎవరితో ప్రేమలో ఉందో తెలుసా? ఇప్పటికి ఎంత మందితో ట్రాక్ నడిపిందో తెలుసా? ఆమె మనసులో మొత్తం ముగ్గురు ఉన్నారట. 


ప్రవీణ్ నాయక్ కంటే ముందు అతడితో...
తన బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తిని కొన్ని రోజుల క్రితం ఫైమా పరిచయం చేసింది. ఆ ప్రవీణ్, ఈ ప్రవీణ్ ఒక్కరేనా? కాదా? అంటూ ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. దానికి కారణం ఉంది. 'జబర్దస్త్'లో ప్రవీణ్ అనే కమెడియన్, ఫైమా మధ్య లవ్ ఉన్నట్టు చూపించారు. కానీ, చివరకు ఫైమా ప్రేమలో ఉన్నది ప్రవీణ్ నాయక్ అని మరొకరితో అని క్లారిటీ వచ్చింది. 


లేటెస్టుగా ఆ 'జబర్దస్త్' ప్రవీణ్ (Jabardasth Praveen) కంటే ముందు మరొక కమెడియన్, 'జబర్దస్త్'తో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో చేస్తున్న నూకరాజు (Jabardasth Nookaraju)తో ఫైమా ట్రాక్ నడిపిందట. ఈ మాట ఎవరో చెబుతున్నది కాదు... 'శ్రీదేవి డ్రామా కంపెనీ' చెప్పింది. లేటెస్ట్ ప్రోమోలో ఎవరి క్రష్ ఎవరు అంటూ కొన్ని ఫోటోలు చూపించారు. ఆ ఫోటోల్లో ఫైమా ఫోటో వచ్చినప్పుడు నూకరాజు, ప్రవీణ్, ప్రవీణ్ నాయక్ ఫోటోలు వచ్చాయి.


తన క్రష్ ప్రవీణ్ నాయక్ మాత్రమేనని, మిగతా ఇద్దరూ కాదని ఫైమా చెప్పలేదు. ''జీవితంలో చాలా కనెక్ట్ అయిన వాళ్ళు, మన కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా! సో అలా అన్నమాట'' అని ఫైమా చెప్పింది. ''అందులో మన నూకు (నూకరాజు) కూడా ఉన్నాడు అన్నమాట'' అని రష్మీ గౌతమ్ అడగ్గా... ''ఎస్! నా గురించి చాలా బాగా ఆలోచిస్తాడు'' అని చెప్పింది ఫైమా. ఆ తర్వాత అతడు చెప్పిన సమాధానం, వచ్చిన సాంగ్ అందర్నీ నవ్వించాయి.


Also Readటాప్ విప్పేసిన అనసూయ... ముద్దులతో అయేషా... ఏడ్చిన అమర్ దీప్... ఏందిరా మీ రచ్చ!



ఆడియన్స్ దృష్టిని తమ వైపు తిప్పుకోవడం కోసం టీవీ ఛానళ్లు ఎప్పటికప్పుడు కొత్త ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాయి. రియాలిటీ షోస్, కామెడీ షోస్ విషయంలో నటీనటుల మధ్య లవ్ ట్రాక్స్ నడుపుతాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్... 'జబర్దస్త్'లో సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్! ఎప్పుడూ ఒకే జంట మీద ట్రాక్ నడిపితే చూసే జనాలకు బోర్ కొడుతుంది కదా! అందుకని, ఎప్పటికప్పుడు ఆ జోడీలను మారుస్తూ ఉంటాయి. ఆ పథకంలో భాగంగా ప్రవీణ్ - ఫైమా జోడీ వచ్చింది. అంతకు ముందు నూకరాజు - ఫైమా జోడీ కూడా అనుకోవచ్చు.


Also Readప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు