విశాఖపట్నంలోని డీఆర్‌డీవో-నేవల్ సైన్స్ & టెక్నలాజికల్ ల్యాబొరేటరీ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీతోపాటు నెట్‌/గేట్‌ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులకు నవంబరు 21, 23 తేదీల్లో వాక్-ఇన్ నిర్వహించనున్నారు. 


వివరాలు..


జూనియర్ రిసెర్చ్ ఫెలో: 07 పోస్టులు


విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.


అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ, వ్యాలిడ్‌ నెట్‌/ గేట్‌ స్కోరు కలిగి ఉండాలి.


వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.


ఇంటర్వ్యూ తేది: 21, 23-11-2023.


వాక్‌ఇన్ వేదిక: 
Naval Science & Technological Laboratory,
Vigyan Nagar, Near N.A.D. Junction,
Visakhapatnam, Andhra Pradesh – 530027


Notification & Application


Website


ALSO READ:


డీఆర్‌డీవో-కాన్పూర్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్, వివరాలు ఇలా
కాన్పూర్‌లోని డీఆర్‌డీవో ఆధ్వర్యంలో డిఫెన్స్ మెటీరియల్స్ అండ్‌ స్టోర్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎంఎస్‌ఆర్‌డీఈ), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ, వ్యాలిడ్‌ నెట్‌/ గేట్‌ స్కోరు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నవంబరు 3న జరిగే వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్ పోస్టులు - ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలు
బెంగ‌ళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్‌), తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 1 వరకు దరఖాస్తులు సమర్పించి, నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నేవల్ షిప్ రిపేర్/ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
నేవల్ షిప్ రిపేర్ యార్డ్ (కార్వార్,కర్ణాటక), నేవల్ ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ యార్డ్ (గోవా) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా 210 అప్రింటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నేషనల్ అప్రెంటిస్‌షిప్ వెబ్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగ ప్రకటన ఎంప్లాయ్‌‌మెంట్ న్యూస్ పత్రికలో ప్రచురితమైననాటి నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..