బెంగళూరులోని డీఆర్‌డీవో- గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు నోటిఫికేషన్ జారీచేసింది. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 16 వరకు తమ దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 150.

✦  గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు (ఇంజినీరింగ్): 75 ఖాళీలు

విభాగాల వారిగా ఖాళీలు..

➥ మెకానికల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్: 30

➥ ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్: 15

➥ఎలక్ట్రికల్స్ & ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/టెలికాం ఇంజినీరింగ్: 10

➥ కంప్యూటర్ సైన్స్ /కంప్యూటర్ ఇంజినీర్/ఇన్ఫర్మేషన్ సైన్స్ &టెక్నాలజీ ఇంజినీర్: 15

➥ మెటలర్జీ/మెటీరియల్ సైన్స్: 04

➥ సివిల్ ఇంజినీర్. లేదా సమానమైనది: 01

✦  గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు- నాన్ ఇంజినీరింగ్ (బీకాం/ బీఎస్సీ/ బీఏ/ బీసీఏ, బీబీఏ): 30 ఖాళీలు

విభాగాల వారిగా ఖాళీలు..

➥ బీకాం: 10

➥ బీఎస్సీ(కెమిస్ట్రీ/ఫిజిక్స్/మ్యాథ్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ మొదలైనవి): 05 

➥ బీఏ(ఇంగ్లీష్/హిస్టరీ/ఫైనాన్స్/బ్యాంకింగ్ మొదలైనవి): 05 

➥ బీసీఏ: 05 

➥ బీబీఏ: 05 

✦ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీలు: 20 ఖాళీలు

విభాగాల వారిగా ఖాళీలు..

➥ మెకానికల్/ప్రొడక్షన్/టూల్ & డై డిజైన్: 10

➥ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ &ఇన్‌స్ట్రూమెంటేషన్: 07

➥ కంప్యూటర్ సైన్స్ /ఇంజినీరింగ్/కంప్యూటర్ నెట్‌వర్కింగ్: 03

✦ ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీలు: 25 ఖాళీలు

విభాగాల వారిగా ఖాళీలు..

➥ మెషినిస్ట్: 03

➥  ఫిట్టర్: 04

➥ టర్నర్: 03

➥  ఎలక్ట్రీషియన్: 03

➥ వెల్డర్: 02

➥  షీట్ మెటల్ వర్కర్: 02

➥ కంప్యూటర్ ఆపరేటర్ &ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా): 08

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000; ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.7000 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.03.2023.

➥  ఇంటర్వ్యూ/ రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 06..04.2023.

Notification

Website

Also Read:

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు!ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, దిగ్బాయ్, పారాదీప్ రిఫైనరీ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 5,395 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!నాగ్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని  ద్వారా మొత్తం 5,395 ఐటీఐ, నాన్ ఐటీఐ ఖాళీలను భర్తీచేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...