CHESS Recruitment: హైదరాబాదులోని డీఆర్‌డీఓకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్ 25 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, డిప్లొమా 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల లోపు దరఖాస్తులు సమర్పించాలి. షార్ట్‌లిస్టింగ్‌, విద్యార్హత మార్కుల పర్సంటేజ్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 25


* గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (ఇంజినీర్స్‌)


⏩ గ్రాడ్యుయేట్‌(డిగ్రీ) అప్రెంటిస్‌: 02
అర్హత: బీఈ / బీటెక్ (కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ / కంప్యూటర్ సైన్స్ / కమ్యూనికేషన్ & కంప్యూటర్ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్సైన్స్ & సిస్టమ్ ఇంజినీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ &ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ / ఇన్ఫర్మేషన్ సైన్స్ & ఇంజినీరింగ్ కలిగి ఉండాలి. 


⏩ గ్రాడ్యుయేట్‌(డిగ్రీ) అప్రెంటిస్‌: 03
అర్హత: బీఈ / బీటెక్ (ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & టెలి-కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ / ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ /అప్రెంటిస్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ఇంజినీరింగ్ / అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ /ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్స్ / కంట్రోల్ ఇంజినీరింగ్ /ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ /ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ ఇంజినీరింగ్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ &ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ / ఎంబెడెడ్ సిస్టమ్ కలిగి ఉండాలి. 


⏩ గ్రాడ్యుయేట్‌(డిగ్రీ) అప్రెంటిస్‌: 03
అర్హత: బీఈ / బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్ / మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ / తయారీ ప్రక్రియ & ఆటోమేషన్ అప్రెంటిస్ ఇంజినీరింగ్ / మెరైన్ ఇంజినీరింగ్ / మెటీరియల్ సైన్స్ & ఇంజినీరింగ్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ / మెకానికల్ &ప్రొడక్షన్ ఇంజినీరింగ్ / మెకానికల్ ఇంజినీరింగ్( రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్) / మెకాట్రానిక్స్ కలిగి ఉండాలి.


⏩ గ్రాడ్యుయేట్‌(డిగ్రీ) అప్రెంటిస్‌: 02
అర్హత: బీఈ / బీటెక్ (కెమికల్ ఇంజనీరింగ్ / కెమికల్ టెక్నాలజీ) కలిగి ఉండాలి.


⏩ టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 05
అర్హత: డిప్లొమా (కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కమ్యూనికేషన్) కలిగి ఉండాలి.


⏩ టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 04
అర్హత: డిప్లొమా (ఎలక్ట్రానిక్స్ / టెలి-కమ్యూనికేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.


⏩ టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 05
అర్హత: డిప్లొమా (మెకానికల్ / మాన్‌ఫ్యాక్చరింగ్ / ప్రొడక్షన్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.


⏩ టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 01
అర్హత: డిప్లొమా (కెమికల్ ఇంజినీరింగ్/కెమికల్ టెక్నాలజీ) కలిగి ఉండాలి.


శిక్షణ వ్యవధి: 12 నెలలు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, విద్యార్హత మార్కుల పర్సంటేజ్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


స్టైపెండ్‌: నెలకు గ్రాడుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.9000, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.8000.


ముఖ్యమైనతేదీలు.


🔰 నోటిఫికేషన్ వెలువడిన తేదీ: 11.05.2024.


🔰 దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..