AP Election 2024 Polling Percentage: కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ 74.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో జిల్లాలో 84.31 శాతం ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాలు ఓసారి పరిశీలిస్తే..

 నియోజకవర్గం 2024 పోలింగ్ శాతం (5 PM వరకు )2019 పోలింగ్ శాతం 
1 పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం   78.25 శాతం 87.1 శాతం 
2గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం 70.61 శాతం85.5 శాతం 
3గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం    73.50 శాతం80.5 శాతం 
4అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం  77.56 శాతం88.9 శాతం 
5పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం   70.53 శాతం 79.8 శాతం
6పెడన అసెంబ్లీ నియోజకవర్గం77.86 శాతం87.7 శాతం 
7మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం   69.74 శాతం80.7 శాతం