Telangana Election 2024 Voting Percentage - హైదరాబాద్: తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 61.16 శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో పోలింగ్ తక్కువ శాతం నమోదు అయింది. తెలంగాణలో 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. సిర్పూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంథని, భూపాలపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, ములుగు, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట లాంటి 13 సమస్యాత్మక కేంద్రాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియడం తెలిసిందే. మిగిలిన 106 నియోజక వర్గాల్లో సాయంత్రం 6 గంటల పోలింగ్ జరుగుతుంది. ఆ సమయానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 

 నియోజకవర్గం3గంటల వరకు పోలింగ్ శాతం 2019లో పోలింగ్ శాతం
1ఆదిలాబాద్ 69.81 శాతం71.42 %
2పెద్దపల్లి 63.86 శాతం65.59 %
3కరీంనగర్ 67.17 శాతం69.52 %
4నిజామాబాద్ 67.96 శాతం68.44 %
5జహీరాబాద్ 71.91 శాతం69.7 %
6మెదక్ 71.33 శాతం71.75 %
7మల్కాజిగిరి 46.27 శాతం49.63 %
8సికింద్రాబాద్ 42.48 శాతం46.5 %
9హైదరాబాద్ 39.17 శాతం44.84 %
10చేవెళ్ల 53.15 శాతం53.25 %
11మహబూబ్ నగర్ 68.40 శాతం65.39 %
12నాగర్ కర్నూల్ 66.53 శాతం62.33 %
13నల్గొండ 70.36 శాతం74.15 %
14భువనగిరి 72.34 శాతం74.49 %
15వరంగల్ 64.08 శాతం63.7 %
16మహబూబాబాద్ 68.60 శాతం69.06 %
17ఖమ్మం 70.76 శాతం75.30 %