AP Election 2024 Polling Percentage: కడప జిల్లాలో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. చిన్న చిన్న గొడవలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ 73.33 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో జిల్లాలో 79.20 శాతం ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాలు ఓసారి పరిశీలిస్తే..

 నియోజకవర్గం 2024 పోలింగ్ శాతం (5 PM వరకు )2019 పోలింగ్ శాతం 
1బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం   73.25 శాతం 76.3 శాతం 
2మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం 78.19 శాతం81.3 శాతం 
3కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం    75.16 శాతం81.9 శాతం 
4జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం  78.55 శాతం85.7 శాతం 
5పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం   75.80 శాతం 89.5 శాతం
6ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం72.26 శాతం76.9 శాతం 
7కడప అసెంబ్లీ నియోజకవర్గం   60.12 శాతం62.8 శాతం